Home /News /andhra-pradesh /

MINISTER GAUTHAM REDDY TRYING TO SOLVE DIVIS LAB ISSUE IN EAST GODAWARI DISTRICT PRN

Andhra Pradesh: అప్పటివరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదు.., ఏపీ మంత్రి కీలక ఆదేశాలు

దివీస్ ల్యాబరేటరీస్ (ఫైల్ ఫోటో)

దివీస్ ల్యాబరేటరీస్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా (East Godawari District) తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ (Divis Lab) చుట్టూ వివాదాలు అలుముపుకున్నాయి. పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ చుట్టూ వివాదాలు అలుముపుకున్నాయి. పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తుండటంతో రాజకీయ దుమారం కూడా రేగుతోంది. దీంతో దివీస్ ఫార్మ పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలుష్య నివారణకు చర్యలు,  ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజా క్షేమం కోసం ప్రతిపాదనలపై ప్రభుత్వం దివీస్ తో చర్చలు జరిపింది.

    అప్పటివరకు ఒక్క ఇటుక కూడా తీయకూడదు :

    దివీస్ పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని స్పష్టం మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నితాంశాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకెళ్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దివీస్ పరిశ్రమ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచుతున్నట్లు మేకపాటి తెలిపారు.

    Andhra Pradesh, Industries, Mekapati Gautham Reddy, Divi’s Lab, East Godaeari, YSCRP, YS Jagan, TDP, ఆంధ్రప్రదేశ్, పరిశ్రమలు, మేకపాటి గౌతమ్ రెడ్డి, దివిస్ ల్యాబ్, తూర్పుగోదావరి జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ జగన్, టీడీపీ
    మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి


    ఇవీ ప్రభుత్వ ప్రతిపాదనలు

    • దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి

    • కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.

    • దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య,  స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు

    •  దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి

    • సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.


    ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రి గౌతమ్ రెడ్డికి వెల్లడించారు. సీఎస్ ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు.

    తొలి నుంచీ రాజకీయ వివాదం

    తొండంగి సమీపంలో నిర్మించ తలపెట్టిన దివీస్ పై ఆది నుంచి రాజకీయ వివాదం నెలకొంది. నిజానికి ఈ పరిశ్రమకు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులిచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దీనిని వ్యతిరేకించింది. ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం అనుకూలంగా ఉండగా.. టీడీపీ వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దెవిస్ కెమికల్ ఇండస్ట్రీతో సహా ఈ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, East Godavari Dist, Mekapati Goutham Reddy, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు