Home /News /andhra-pradesh /

MINISTER GAUTAM REDDY AND APIIC CHAIRPERSON ROJA INAUGURATED NEW INDUSTRIAL POLICY AK

ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ.. వారికి ప్రత్యేక రాయితీలు

ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

Ap new industrial policy: కరోనా పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు.

    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించినట్టు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో వైఎస్సార్ వన్ పేరుతో కొత్త కొత్త విధానం తీసుకొచ్చామని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు.

    కరోనా పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు. ఈ కొత్త పాలసీ సీఎం జగన్ విజన్‌కు నిదర్శనమని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా అన్నారు. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని ఆమె తెలిపారు. పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పాలసీ ఉంటుందని అన్నారు. కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉందని.. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని రోజా తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister gautam reddy, MLA Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు