జగన్ కేబినెట్‌లోని ఆ మంత్రికి ప్రమోషన్ ?

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కేబినెట్‌లోకి తీసుకోనున్న చెల్లుబోయిన వేణుగోపాల్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి కావడంతో... ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

 • Share this:
  ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలను రేపు భర్తీ చేయనున్నారు సీఎం జగన్. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా కారణంగా ఖాళీ అయిన స్థానాలను వారి సామాజికవర్గానికే చెందిన సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌తో భర్తీ చేయాలని సీఎం జగన్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉపముఖ్యమంత్రి పదవిని సీఎం జగన్ ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కేబినెట్‌లోకి తీసుకోనున్న చెల్లుబోయిన వేణుగోపాల్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి కావడంతో... ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

  Deputy cm post for Dharmana Krishnadas, Minister Dharmana Krishnadas, cm ys jagan mohan reddy cabinet, pilli subhash Chandra bose, ap deputy cm post, bc deputy cm post in ap, ap cabinet expansion news, మంత్రి ధర్మానకు డిప్యూటీ సీఎం పదవి, మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎం జగన్ కేబినెట్, ఏపీ కేబినెట్ విస్తరణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీ డిప్యూటీ సీఎం పోస్ట్, బీసీ డిప్యూటీ సీఎం పోస్టు, ఏపీ కేబినెట్ విస్తరణ వార్తలు
  ధర్మాన కృష్ణదాస్(ఫైల్ ఫోటో)


  ఇదిలా ఉంటే ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎం పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు కట్టబెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన పిల్లి నిర్వహించిన డిప్యూటీ సీఎం పదవిని.. బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సీఎం జగన్... పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ కాబోయే బీసీ కోటా డిప్యూటీ సీఎం పదవిని ఎవరికి కేటాయిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. బీసీలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనే తన నిర్ణయాల ద్వారా చాటి చెబుతున్న సీఎం జగన్... మరో బీసీ మంత్రిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
  Published by:Kishore Akkaladevi
  First published: