Home /News /andhra-pradesh /

MINISTER DADISETTY RAJA SLAMS PAWAN KALYAN AND CHANDRABABU NAIDU OVER POLITICS UMG

రాజకీయాలంటే ప్యాకేజీలు, ప్యాకప్‌లు కావు.. కాపులను బలిచ్చేందుకే పవన్ పార్టీ.. ప్రతిపక్షాలపై మంత్రి దాడిశెట్టి విమర్శలు

మంత్రి దాడి శెట్టి రాజా (Image Source: FB/DadisettyRaja)

మంత్రి దాడి శెట్టి రాజా (Image Source: FB/DadisettyRaja)

చంద్రబాబు (Chandra babu), ఆయన కుమారుడు (Lokesh), దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజలు ఎటువైపు ఉన్నారనేది వారికి పట్టడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) విమర్శించారు. ఎంతసేపూ ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు.. దాన్ని చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే జనసేన (Janasena) పార్టీ ఏర్పాటు చేశానని నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్‌ కళ్యాణ్‌ చెప్పారని.. కానీ వాస్తవం ఏమిటన్నది ప్రజలందరికి తెలుసని మంత్రి అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    చంద్రబాబు (Chandra babu), ఆయన కుమారుడు (Lokesh), దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజలు ఎటువైపు ఉన్నారనేది వారికి పట్టడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) విమర్శించారు. ఎంతసేపూ ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు.. దాన్ని చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే జనసేన (Janasena) పార్టీ ఏర్పాటు చేశానని నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్‌ కళ్యాణ్‌ చెప్పారని.. కానీ వాస్తవం ఏమిటన్నది ప్రజలందరికి తెలుసని మంత్రి అన్నారు.

    పవన్ కల్యాణ్‌కి అసలు స్వతంత్రం ఉందా అని అడిగిన మంత్రి.. చంద్రబాబు నుంచి స్వాతంత్ర్యం పొందాలని సలహా ఇచ్చారు. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ కోసం కాపులను బలి పెడుతున్నారని.. ఇది తెలుగు జనసేన అంటూ విమర్శించారు. దమ్ముంటే, వచ్చే ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ, ఎంపీ సీట్లలో పోటీ చేయాలని.. అంతే కానీ ప్యాకేజీ అందగానే అప్పుడప్పుడు రావడం, రాజకీయాలు చేయడం, ప్యాకప్‌ చెప్పి వెళ్లడం కాదు. ఇలాంటి రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించబోరంటూ దాడిశెట్టి చురకలు అంటించారు.

    ఇదీ చదవండి: అతి త్వరలోనే జగన్ పెద్ద కుంభకోణం వెలుగులోకి.. పొలిటికల్ బాంబ్ పేల్చిన లోకేశ్


    దిక్కు తోచక తుచ్ఛ రాజకీయాలు
    ఇవాళ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడప గడపకూ కార్యక్రమం నిర్వహిస్తోందని.. దీన్ని చూపి చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌ తట్టుకోలేక పోతున్నారని దాడిశెట్టి రాజా విమర్శించారు. అదే విధంగా ఏ సర్వే చూసినా కూడా వైఎస్సార్‌సీపీదే విజయం అని చెబుతున్నాయని.. ఆ సర్వేల ఫలితాలు కానీ, ప్రజల స్పందన అంత స్పష్టంగా ఉండడంతో దిక్కు తోచని మీరు తుచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

    నీకంటూ స్టాండ్‌ ఉందా పవన్?
    "పవన్‌కళ్యాణ్‌ మీకు ఒక స్థిరమైన వైఖరి ఉందా? ఒక స్టాండ్‌ మీద నిలబడగలరా? 2001లో నీవు పెప్సి డ్రింక్‌ యాడ్‌ చేశావని చెప్పి, చంద్రబాబు వర్గమంతా ఆ డ్రింక్‌ను బాయికాట్‌ చేయగా, అదే వర్గం చిరంజీవిగారు థమ్సప్‌ డ్రింక్‌ యాడ్‌లో నటిస్తే, దాన్ని కూడా బాయికాట్‌ చేసింది. అయినా నీవు ఏ మాత్రం నైతికత లేకుండా చంద్రబాబును సమర్థిస్తున్నావు. అయితే నీ అవసరం తీరగానే, నీకిచ్చే ప్యాకేజీ అయిపోగానే, చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నిన్ను పూర్తిగా పక్కన కూర్చోబెడతారు" జాగ్రత్త అని మంత్రి సూచనలు ఇచ్చారు.



    ఎక్కువగా ఊహించుకుంటున్నావు..
    "గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావు. అయినా నీ గురించి నీవు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. షణ్ముఖ వ్యూహం పన్నుతాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని అంటున్నా, నీవు వాస్తవానికి చేసేది, చంద్రబాబు చెప్పింది అమలు చేయడమే. అంటే చంద్రబాబు చెప్పిన వ్యూహాన్ని మాత్రమే నీవు అమలు చేస్తావు. అందుకే ఇప్పుడు కూడా విలువలేని రాజకీయాలు చేస్తున్నావు" అని పవన్‌కళ్యాణ్‌కు మంత్రి శ్రీ దాడిశెట్టి రాజా చురకలంటించారు.
    First published:

    Tags: AP Politics, Chandrababu Naidu, Pawan kalyan, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు