హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Budget 2022: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. ఈసారి బడ్జెట్ ఎంతంటే..!

AP Budget 2022: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. ఈసారి బడ్జెట్ ఎంతంటే..!

సీఎం జగన్ తో ఆర్ధిక మంత్రి బుగ్గన

సీఎం జగన్ తో ఆర్ధిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ (AP Budget-2022) ను ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.56, 256 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం 2,08,261 వేల కోట్లు, మూలధన వ్యవయం 47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు , ద్రవ్యలోటు 48,724గా మంత్రి బుగ్గన పేర్కొన్నారు. జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా ఉందన్నారు. విద్య,వైద్య, వ్యవసాయంతో పాటు నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. గతంలో కంటే ఎక్కువ అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. ఎన్నికల హామీల అమలుకే బడ్జెట్ లో ప్రాధాన్యత లభిచింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. విపత్తులు ఎదుర్కొన్నప్పుడే మన సామర్ధ్యం తెలుస్తోందన్నారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా

వైఎస్ఆర్ రైతు భోసాకు రూ.3,900 కోట్లు, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకానికి రూ.1802 కోట్లు, వైఎస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలకు రూ.500 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు రూ.1800 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, వ్యవసాయ విద్యుత్ రాయితీలకు రూ.5వేల కోట్లు కేటాయించారు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖకు రూ.11,387 కోట్లు, పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖకు రూ.1568 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.18వేల కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.20,962 కోట్లు కేటాయించారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,014 కోట్లు, పాఠశాల విద్యకు రూ.27,706 కోట్లు, కేటాయించారు. ఇరిగేషన్ ఫ్లండ్ కంట్రోల్ కు రూ.11,482 కోట్లు, జనరల్ ఎకో సర్వీసెస్ కు రూ.4,420 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.10,281 కోట్లు, పరిశ్రమలకు రూ.2775.17 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,109 కోట్లు, పర్యావరణ అటవీ శాఖకు రూ.685 కోట్లు, రవాణా రంగానికి రూ.9,617 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు రూ.3,719 కోట్లు కేటాయించారు.

నాడు-నేడు, వైఎస్ఆర్ జలకళ, రోడ్ల నిర్మాణాలు, వ్యవసాయంలో మౌలిక సదుపాయల కల్పన జరుగుతోందన్నారు. జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ కాలనీల వల్ల అందరికీ ఇళ్లు అనే లక్ష్యాన్ని చేరుకుంటున్నామన్నారు బుగ్గన. రాష్ట్రంలో సంక్షేమం, సామాజిక భద్రతకు పెద్దపీట వేశామని.. మహిళా సాధికారితను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోటు, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పాటు మహిళలను అమూల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో వ్యాపార భాగస్వాములుగా చేర్చి వారి ఆర్ధిక సాధికారితకు ప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. ఇక సామాజిక పెన్షన్లకు అధిక కేటాయింపులు చేస్తూ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటున్నామన్నారు.

First published:

Tags: AP Budget 2022

ఉత్తమ కథలు