హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Botsa: నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు

Minister Botsa: నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు

మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa: రాష్ట్ర రాజకీయాల్లో బొత్స చాలా సీనియర్.. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో కీలక మంత్రి.. అలాంటి ఆయన ఏం చెప్పాలనుకున్నా ఆచితూచి మాట్లాడాలి.. కానీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అది కూడా మహానటి సావిత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Minister Botsa: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh) బొత్స సత్యనాయారణ (Botsa Satyanarayana)కు ప్రత్యేక గుర్తింపు ఉంది.. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఆయన చాలా సీనియర్ అంతే కాదు.. వివిధ పార్టీల్లో కీలక పదవులు నిర్వహించారు. సీఎం జగన్ (CM Jagan) కేబినెట్ లో రెండోసారి మంత్రిగా కొనసాగుతున్న వారిలో ఆయన ఒకరు.. ప్రస్తుతం జనగ్ రెడీ చేసుకున్న ఎన్నికల టీంలో బొత్స కీలక నేత.. అంతేకాదు.. ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే శక్తి ఉన్న నేత.. అలాంటి ఆయన ఏమి మాట్లాడినా చర్చ అవుతుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆ పొజిషన్ లో ఉన్న ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి బొత్స ఇప్పుడు పరధ్యానంలో ఆ పదం ఉపయోగించారా..? లేక వేరే పదం అనబోయి.. ఆ పదం వాడారా...? అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే మహానటి సావిత్రి (Mahanati Savitri) ని తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానిస్తారు.. ఆరాధిస్తారు.. గౌరవిస్తారు కూడా..

సావిత్రి చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందారు. ఆమె గొప్ప నటి అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కుంది.. అయినా మానవత్వం చూపించడంలోనూ.. నటనలోనూ అత్యున్నత స్థానంలో నిలిచింది. అందుకే ఆమె మహానటి అని పేరు తెచ్చుకున్నారు.

ఇటీవల మహానటి సినిమా ద్వారా.. ఆమె జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో.. ప్రపంచానికి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎప్పుడూ ఒకరికి ఇచ్చే గుణం తప్ప.. చేయి చాపే గుణం కాదు ఆమెది. చాలామంది చేతుల్లో మోసపోవడంతోనే చివరికి ఆమె జీవితం అలా అయ్యింది. ఎన్నో సిరిసంపదలు సంపాదించి కూడా.. జీవిత చరమాంకంలో దుర్భర జీవితాన్ని అనుభవించారు. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించారు. తెలుగునాట పుట్టిన అరుదైన వ్యక్తిత్వం, ప్రతిభ ఉన్న మహిళ సావిత్రి.. అలాంటి ఆవిడను మంత్రి బొత్స అవమానకర రీతిలో సంభోదించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆయన ఏమన్నారంటే..? ఏపీకి సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా చూసేందుకు జనం వస్తారని బొత్స అన్నారు. పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు రావడంలో గొప్ప ఏముందని.. ఎవరు వచ్చినా జనం వస్తారని విమర్శించే క్రమంలో ఉదాహారణగా సావిత్రి పేరును తీసుకున్నారు. ఆమె పేరుకు ముందు చెప్పరాని, రాయరాని ఒక పదాన్ని వాడారు. దీంతో సావిత్రి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మంత్రి పరధ్యానంలో ఆ మాట అని ఉండవచ్చు. తర్వాత అయినా రియలైజ్ అయ్యి.. ఆ పదం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా.. క్షమాపణలు చెప్పినా హుందాగా ఉండేదన్నది మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana

ఉత్తమ కథలు