Home /News /andhra-pradesh /

MINISTER BOTHA SAID THAT THE LG POLYMERS GAS LEAKAGE EVENT WAS DUE TO INDUSTRY FAILURE BN

టీడీపీది డ్రామా కంపెనీ.. స్క్రిప్ట్ చదివే నాటకం.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ

మెజార్టీ ప్రజల అభిప్రాయలను లెక్కలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని నివాసాల మధ్య నుంచి తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాల్లో పూర్తిగా కెమికల్ శుద్ధి చేస్తామని తెలిపారు.

    ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని, నిపుణుల సూచనల మేరకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన కేవలం పరిశ్రమ యాజమాన్య వైఫల్యం వల్లే జరిగిందని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పేందుకు తాము ఏమాత్రం సిద్ధంగా లేమని చెప్పారు. టీడీపీది డ్రామా కంపెనీ అని.. స్క్రిప్ట్ చదివే నాటకం రక్తి కట్టించామా లేదా అని చూసుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. మెజార్టీ ప్రజల అభిప్రాయలను లెక్కలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని నివాసాల మధ్య నుంచి తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాల్లో పూర్తిగా కెమికల్ శుద్ధి చేస్తామని, తర్వాతే ప్రజలను ఇళ్లలోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా ఏది పడితే అది తాము మాట్లాడలేదని, రేపట్నుంచి బాధితులకు నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, Minister, Vizag gas leak

    తదుపరి వార్తలు