హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Anil Kumar Yadav: ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం..

Minister Anil Kumar Yadav: ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం..

మంత్రి అనిల్‌కుమార్ యాదవ్(Iamge-Twitter)

మంత్రి అనిల్‌కుమార్ యాదవ్(Iamge-Twitter)

నెల్లూరు దర్గామిట్ట ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. బాధితులకు ఆస్పత్రులలో అందుతున్న సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి తనిఖీలు చేపట్టారు. ఆదివారం నెల్లూరు దర్గామిట్ట ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన.. మంత్రి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి వైద్యులకు, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ఇక, రెండు రోజులుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. బాధితులకు సరైన వైద్యం అందుతుందా? లేదా? అనే వివరాలు ఆరా తీస్తున్నారు.

శనివారం సాయంత్రం మంత్రి అనిల్‌కుమార్ నారాయణ కోవిడ్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందిచేలా చర్యలు తీసుకోవాలని నారాయణ ఆస్పత్రి డాక్టర్లకు సూచించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై కూడా ఆరా తీశారు. అనంతరం నారాయణ ఆస్పత్రి ఏజీఎం భాస్కర్‌రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిజూ రవీంద్రలతో మంత్రి మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 50,972 శాంపిల్స్ ని పరీక్షించగా 11,698 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,18,031 చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,28,944 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, నెల్లూరులో గడిచిన 24 గంటల్లో 5,400 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 902 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, Coronavirus, Covid-19, Nellore

ఉత్తమ కథలు