పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... ఈ విషయంలో తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోవద్దని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.కృష్ణా జలాలఎత్తిపోతల పథకం పై మా నిర్ణయం మాదే అని స్పష్టం చేసిన మంత్రి అనిల్... తెలంగాణ వాళ్ళ నిర్ణయం వాళ్లదని వ్యాఖ్యానించారు. తమకు రావాల్సిన వాటానే తాము తీసుకుంటున్నామని తెలిపారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణకు నష్టమేంటో తనకు అర్థమవడం లేదని ఆయన అన్నారు.
ఈ జలాలను తీసుకోవడం వల్ల నెల్లూరు, రాయలసీమలో ఐదు జిల్లాలో తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. పొలిటికల్ స్టంట్ కోసమే కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. వెలుగొండ టిడిపి హయంలో పూర్తి అయ్యింది అని చెప్పుకోవడం సిగ్గు చేటని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాయలసీమకు నష్టం చేసింది టిడిపి కదా అని ప్రశ్నించారు. నిజంగా రాయలసీమకు టీడీపీ న్యాయం చేసి ఉంటే ఇక్కడి ప్రజలను 10 సీట్లు అయినా ఇచ్చేవారని అన్నారు. గాలేరు, నగరి పూర్తి చేయకుండానే మేము చేశాము అని అంటున్నారని మండిపడ్డారు.
పోలవరం 70 శాతం చేశాము అని చెప్పుకునే దేవినేని ఉమా.. దాన్ని నిరూపిస్తే మీసం తీసుకొని తిరుగుతానని మంత్రి అనిల్ సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే నువ్వు మీసం తీసి తిరుగుతావా అని ప్రశ్నించారు. పులిచింతలలో ఫుల్ కెపసిటి పెట్టింది మేమే అని వ్యాఖ్యానించారు. చరిత్ర సృష్టించాలి అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే అని మంత్రి అనిల్ అన్నారు. నీళ్లు అమ్ముకునే బుద్ధి మీది మాది కాదని... డిసెంబర్‌లోపు నెల్లూరు బ్యారేజిని పూర్తి చేస్తామని అన్నారు. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Pothireddypadu, Telangana