హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Alla Nani: వారిని వదిలిపెట్టం.. కఠిన చర్యలు తప్పవన్న ఏపీ మంత్రి

Alla Nani: వారిని వదిలిపెట్టం.. కఠిన చర్యలు తప్పవన్న ఏపీ మంత్రి

ఆళ్ల నాని (ఫైల్ ఫోటో)

ఆళ్ల నాని (ఫైల్ ఫోటో)

భద్రత ప్రమాణాలు పాటించిన కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుమతి ఇస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటన బాద్యులను వదిలే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. 10 మృతికి కారకులైన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్‌లో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘన జరిగిన వెల్లడయిందని తెలిపారు. ఇప్పటికే అగ్ని ప్రమాద ఘటన కు కారకులు అయినా వారిని అరెస్ట్ చేయడం జరిగిందని ఆళ్ల నాని వెల్లడించారు. డాక్టర్ రమేష్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.

భద్రత ప్రమాణాలు పాటించిన కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుమతి ఇస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ మానవత్వంలో స్పందించి మృతుల కుటుంబాలకు 50లక్షలు రూపాయలు ఎక్సగ్రేషుయా ప్రకటించారని తెలిపారు. విజయవాడలో ఆరుగురి కుటుంబాలకు, 50 లక్షల రూపాయల చెక్‌లు అందించామని.. మిగిలిన వారికి కూడా సాయం చేస్తున్నామని తెలిపారు. రమేష్ హిస్పిటల్ కి సంబందించిన కోవిడ్ అనుమతులు రద్దు చేశామని.. రమేష్ హాస్పిటల్‌లో రోగులు నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు విచారణ కమిటీ రిపోర్ట్‌లో స్పష్టమైందని ఆళ్ల నాని తెలిపారు.

First published:

Tags: Alla Nani, Andhra Pradesh

ఉత్తమ కథలు