Home /News /andhra-pradesh /

MINING DEPARTMENT CONCENTRATED ON ILLEGAL MINING IN KUPPAM AFTER TDP CHIEF CHANDRA BABU NAIDU TOUR FULL DETAILS HERE PRN TPT

Kuppam: కుప్పంలో అక్రమ మైనింగ్ ప్రభుత్వం దృష్టి.. చంద్రబాబు పర్యటనే కారణమా..?

చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrabau Naidu) పర్యటన అనంతరం కుప్పంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికేఅధికార పార్టీపై పలు రాష్ట్రాలను సంధించిన బాబు... కుప్పంలో అక్రమ మైనింగ్ లపై తీవ్ర స్థాయిలోధ్వజమెత్తారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్కడున్న అక్రమ క్వారీలపై వరుస దాడులు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrabau Naidu) పర్యటన అనంతరం కుప్పంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికేఅధికార పార్టీపై పలు రాష్ట్రాలను సంధించిన బాబు... కుప్పంలో అక్రమ మైనింగ్ లపై తీవ్ర స్థాయిలోధ్వజమెత్తారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్కడున్న అక్రమ క్వారీలపై వరుస దాడులు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా మారిన మైనింగ్ అధికారులు అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో భారీ స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను సీజ్ భారీ మొట్టణంలో సీజ్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారు అంటూ ఏపి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు.

    ఈ నెల మొదటి వారంలో తన సొంత నియోజకవర్గం కుప్పంకు వచ్చిన చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు ఇక్కడే గడిపారు. చివరి రోజు అనూహ్యంగా ఆయన అక్రమ క్వారీలను సందర్శించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న తీరును చూసి నివ్వెర పోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా స్థానిక నేతలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు.

    ఇది చదవండి: “కొడాలి నానిని లాకప్ లో వేసిన కుమ్మిన టీడీపీ నేత”.. మాజీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్..


    క్వారీ జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.. స్థానిక వైసీపీ నేతలు అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఆశీస్సులతోనే కుప్పం వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాగా చంద్రబాబు ఆరోపణలు చేసిన 24 గంటల వ్యవధిలోనే మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు.

    ఇది చదవండి: కరోనా సమయంలో జగన్ సర్కార్ కు షాక్..? సమ్మెలోకి కీలక శాఖ ఉద్యోగులు..?


    నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన శాంతిపురం మండలంలోని ముద్దునపల్లె, సి బండపల్లి గ్రామాలలోని క్వారీలను అధికారులు ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డితో సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో అక్రమ క్వారీ జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన మైనింగ్ అధికారులు ఎట్టకేలకు దూకుడు పెంచారు.

    ఇది చదవండి: వీళ్లను ఢీ కొట్టే నేతలు టీడీపీలో లేరా..? బాబు మేల్కోకుంటే ఆశలు వదులుకోవాల్సిందే..!


    పెద్ద ఎత్తున మైనింగ్ అధికారులు కుప్పంకు చేరుకొని, నాలుగు బృందాలుగా విడిపోయి పలు క్వారీలను సందర్శించారు.. ఎలాంటి అనుమతులు లేకుండా అనేక చోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు.. గడచిన పది రోజులుగా కుప్పం నియోజకవర్గం అంతటా మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇప్పటి వరకు మైనింగ్ కు వినియోగించే నాలుగు ప్రొక్లెయినర్లు, 10 కంప్రెసర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. తరలించడానికి సిద్ధంగా ఉన్న 200 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఈ దాడులు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు, కాగా అధికారుల తనిఖీలతో మైనింగ్ మాఫియా ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు