Milk Rate Hike: పెరుగుతున్న సంగం పాల ధర... మిగతా కంపెనీలు కూడా అదే బాటలో...

పెరుగుతున్న సంగం పాల ధర (image credit - facebook)

Milk Rate Hike: నిత్యవసరాలు, అత్యవసరాల ధరలు పెరుగుతుంటే... పాల కంపెనీలు కూడా ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ క్యూలో సంగం ముందు ఉంది.

  • Share this:
    Milk Rate Hike: "తెల్లారితే చాలు... అన్నీ ధరల పెంపు వార్తలే మనకు కనిపిస్తాయి. మన జీతాలు, వేతనాలు మాత్రం పెరగవు" అన్నది సామాన్యుల ఆవేదన. నిజమేమరి ఈ రోజుల్లో చాలా నిత్యువసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. కరోనా టైమ్‌లో కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు... ధరలను పెంచి అమ్మారు. ఇప్పుడు లాక్‌డౌన్ లేకపోయినా... అలాగే పెంచిన ధరలకు అమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్రెడీ ఆకాశంలో ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పటికే ఎక్కువగా ఉన్న పాల ధరలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ముందుగా సంగం పాల ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొద్దిగా ధర పెంచుతున్నట్లు సంగం డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు. అర లీటర్ పాలకు రూ.1 చొప్పున పెంచుతున్నామని వివరించారు. పాల ఉత్పత్తుల ధరల్లో మాత్రం మార్పు లేదన్నారు. ఈ ఒక్క కంపెనీ ధర పెంచినా చాలు.. మిగతా కంపెనీలు కూడా పెంచేందుకు సిద్ధమవుతాయి.

    ఈ ఏప్రిల్ 1 అనేది ప్రజలకు ఏమాత్రం నచ్చని డేట్ అనుకోవచ్చు. ఈ రోజు వస్తే చాలు... చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఏసీ, టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఒక ఏసీకి రూ.200 నుంచి రూ.1,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఏసీలు మాత్రమే కాదు రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి టీవీల ధరలు కనీసం రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య పెరగనున్నాయని అంచనా. ఇప్పటికే కొన్ని నెలలుగా టీవీల ధరలు పెరుగుతున్నాయి.

    ఇది కూడా చదవండి:Fruits Benefits: ఏ పండ్లతో ఏ మేలు కలుగుతుంది? ఏ వ్యాధికి ఏ పండు తినాలి?

    కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో వీటితో పాటు సోలార్ ఇన్వెర్టర్లు, లాంతర్లు, ఆటోమొబైల్ పార్ట్స్, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కాంపోనెంట్స్, లిథియం అయాన్ బ్యాటరీ రా మెటీరియల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్ నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ఐటెమ్స్ ధరలు పెరుగుతాయి.
    Published by:Krishna Kumar N
    First published: