మంగళగిరిలో ఉద్రిక్తత.. పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను, ఆయా రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి స్వస్థలాకు పంపిస్తున్నాయని.. మరి ఏపీ అధికారులు ఎందకు పంపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: May 8, 2020, 3:32 PM IST
మంగళగిరిలో ఉద్రిక్తత.. పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎయిమ్స్ వద్ద పలు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాకు పంపించాలంటూ ధర్నాకు దిగారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడిచేశారు. అంతేకాదు ఎయిమ్స్‌లోని సెక్యూరిటీ గదిలోకి కొందరు ఆందోళనకారులు దూసుకెళ్లిన ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే...మంగళగిరి ఎయిమ్స్‌లో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తమను సొంతూళ్లకు పంపాలని కొన్ని రోజులుగా అధికారులను కోరుతున్నారు. ఐతే 3 రోజుల క్రితం అధికారులు హామీ ఇచ్చినా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వలస కార్మికులు వాపోతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను, ఆయా రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి స్వస్థలాకు పంపిస్తున్నాయని.. మరి ఏపీ అధికారులు ఎందకు పంపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఎయిమ్స్ ముందు ఆందోళన చేశారు వలస కార్మికులు. సెక్యూరిటీ గదిని ధ్వంసం చేయడంతో.. మంగళగిరి అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వలస కార్మికులతో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల రెడ్‌జోన్‌లో ఉందని.. ఈ క్రమంలోనే కూలీలను అనుమతించేందుకు ఇతర రాష్ట్రాలు సుముఖంగా లేవని చెప్పారు.
Published by: Shiva Kumar Addula
First published: May 8, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading