శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు.. అధికారుల్లో ఆందోళన

శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు.. అధికారుల్లో ఆందోళన

ప్రతీకాత్మక చిత్రం

అవినీతిలో ప్రధాన వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన వారిని సైతం ప్రత్యేకంగా విచారించారు. ఇదీకాక టీఎంఎస్ సర్వీసెస్ వారిని కూడా విచారించనున్నట్టు తెలిసింది.

  • Share this:
    శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ జేడీ గంగాధర్ రావు ఆధ్యర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది. విరాళాల కేంద్రానికి ఆకస్మికంగా చేరుకుని తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అవినీతిలో ప్రధాన వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన వారిని సైతం ప్రత్యేకంగా విచారించారు. ఇదీకాక టీఎంఎస్ సర్వీసెస్ వారిని కూడా విచారించనున్నట్టు తెలిసింది. ఆలయంలో జరిగిని అవినీతి కుంభకోణంపై విచారణ సాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు చర్చకు రావడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

    దేవస్థానంలో జరిగిన కుంభకోణం కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తలకు సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ఇచ్చిన రూ.లక్షలను దోచుకున్న వైనం ఇటీవల బయటపడిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొండపై తిరుగుతూ శ్రీశైలంలోని పలు నిత్యాన్న సత్రాలతో పాటు టోల్ గేట్, అన్నదాన కేంద్ర, పెట్రోల్ బంక్, వసతి సముదాయంలోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
    First published:

    అగ్ర కథనాలు