Home /News /andhra-pradesh /

MID DAY MEALS FOOD POISON IN GOVERNMENT SCHOOL IN KURNOOL DISTRICT NGS

Food Poison: ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం.. 42 మంది విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్నం భొజనం వికటించి అస్వస్తత

మధ్యాహ్నం భొజనం వికటించి అస్వస్తత

Food Poison: ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనం వికటించింది. భోజనం తిన్న వెంటనే 42 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అందరూ ఒకేసారి అలా అవ్వడానికి ఫుడ్ పాయిజనే కారణమంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నవారిలో.. ఇద్దరు ముగ్గురు పరిస్థితి తప్పా.. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటున్నారు.

ఇంకా చదవండి ...
    Food Poison:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా.. సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థుల ప్రాణాలపైకి తేస్తోంది. అందుకే ఇటీవల ఏపీలో భొజనం వికటించిన ఘటనలు తరచూ వినాల్సి వస్తోంది.  తాజాగా కర్నూలు జిల్లా (Kurnool Distirct) నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆందోళనకరణ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో.. కాసేపటికే కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు భయపడి ఏం జరిగిందో అని ఆందోళన చెందారు. ఏ మాత్రం ఆలస్యం చేయడకుండా అస్వస్తతకు గురైన విద్యార్థులను దగ్గర్లోనే ఉన్ననంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో.. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. పిల్లలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన హెచ్‌ఎం లక్ష్మీనరసింహులును డీఈవో సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు.

    అయితే విద్యార్థులు అందరికీ ఉడకని భోజనం పెట్టడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకుని ఎంపీ తలారి రంగయ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరిద్దరు మినహా అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యమైనదిగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నా.. పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు. అయినా భోజనం తిన్న విద్యార్ధులు అస్వస్థతక గురి అవుతున్న ఘటనలు తరచు జరుగుతున్నాయి. ఈక్రమంలో మరోసారి విద్యార్ధులు మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రిపాలయ్యారు.

    ఇదీ చదవండి : అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం.. ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

    స్కూల్లో మొత్తం 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా.. వారిలో కొంత మంది భోజనం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారు. అది గుర్తించిన టీచర్లు వెంటనే విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకున్నారు.తమ బిడ్డలు ఆరోగ్యంగా తిరిగి రావాలని వారికి ఎటువంటి ప్రమాదం జరుగకూడదని మొక్కుకున్నారు. మరోవైపు ఈ పరిస్థితి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. తమ పిల్లలకు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇకప్పటికైనా పూర్తి పర్యవక్షేణ ఉంచి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేయాలని కోరుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు