Home /News /andhra-pradesh /

MICROSOFT DEAL WITH ANDHRA PRADESH GOVERNMENT THEY TRAINED ONE LAKH 62 THOUSAND STUDENTS NGS

Microsoft: ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్.. 1.62 లక్షల విద్యార్ధులకు శిక్షణ..

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్‌

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్‌

Andhra Pradesh MOU with Microsoft: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యంపై ఫోకస్ చేస్తోంది. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్‌ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇప్పిస్తోంది. అజూర్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్‌ సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేసింది.

ఇంకా చదవండి ...
  Andrha Pradesh Skill Development: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) విద్యార్ధుల్లో నైపుణ్యాన్ని (Skill Devlopment) పెంచి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఏపి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా డిగ్రీస్ధాయిలో ఉండే విద్యార్ధులపై (Degree Students) ప్రధానంగా దృష్టిసారిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెపొందించేందుకు ప్రపంచ అగ్రశ్రేణి సంస్ధ మైక్రోసాఫ్ట్ తో శిక్షణ (Microsoft Training) ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ సంస్ధతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఒప్పందం చేసుకోగా, కరోనా వైరస్ (Corona Virus)కారణంగా విద్యాసంస్ధలు (Educational Institutes)మూతపడటంతో అది అమలు సాధ్యంకాలేదు. అయితే ఒప్పంద గడువును వచ్చే ఏడాది డిసెంబరు వరకు పొడగిస్తూ తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy)అదేశాల నేపధ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మైక్రోసాఫ్ట్ సంస్ధ విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్‌ స్కిల్స్‌ నైపుణ్యాలపై శిక్షణను ఈ సంస్ధ ఇవ్వనుంది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్‌ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. శిక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం 30.79 కోట్ల రూపాయలను ఖర్చుచేయనుంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అధునాతన సాఫ్ట్‌వేర్‌ అంశాలను ఈ శిక్షణలో విద్యార్ధులకు బోధించనుంది. ప్రత్యేక డొమైన్‌ ద్వారా 40 సర్టిఫికేషన్‌ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.

  సర్టిఫికేషన్‌ కోర్సులతో పాటు అదనంగా లింకిడ్‌ ఇన్‌ లెర్నింగ్‌ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్‌ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ 7,500 రూపాయలు అంటే డాలర్లలో చెప్పాలి అంటే.. 100 యూఎస్‌ డాలర్లు విలువ గల అజూర్‌పాస్‌ ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. క్లౌడ్‌ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు.

  ఇదీ చదవండి: టీడీపీ నుంచి వచ్చిన ఆ ముగ్గురుకు బీజేపీ అధిష్టానం షాకిచ్చిందా..? పార్టీని పార్కింగ్ లా వాడుతున్నారా..?

  పరిశ్రమలకు అవసరమైన కోర్స్..                                                                                     పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్‌ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. అజూర్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్‌ సర్వీసులు అందుతాయి. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్‌ లెర్నింగ్‌ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. మైక్రోసాఫ్ట్‌ ద్వారా సర్టిఫికేషన్‌ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

  ఇదీ చదవండి: మళ్లీ తప్పని కరెంటు కోతలు..! ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఇదే..

  సర్టిఫికేషన్‌ కోర్సులతో ఉద్యోగావకాశాలు..                                                                              విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఓమ్‌జివాన్‌ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్‌ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు.

  ఇదీ చదవండి: ఏపీలో రైతులకు శుభవార్త... ఈ పంటల సాగుకు ప్రోత్సాహం..

  కొత్త కరిక్యులమ్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ                                                                                        ఆన్‌లైన్‌ విధానంలో ఈ శిక్షణకార్యక్రమం కొనసాగనుంది. అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్‌ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్‌ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ గుర్తించిన సంస్థల ద్వారా మాక్‌ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్‌ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్‌లో భద్రపరుస్తారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Microsoft

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు