మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. బీఎన్ యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

news18-telugu
Updated: September 13, 2019, 6:15 PM IST
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం
సత్య నాదెళ్ల, ఆయన తండ్రి యుగంధర్
  • Share this:
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇవాళ తుదిశ్వాస విడిచారు. యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రధాని సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు.
బీఎన్ యుగంధర్‌గా ఐఏఎస్ సర్కిల్స్‌లో పేరుపొందిన యుగంధర్ పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధిలో ఎన్నో పాలనాపరమైన సంస్కరణలకు బీజం వేశారు. వాటర్ షెడ్ల అభివృద్ధికి సంబంధించిన కేంద్రం నిధులు నేరుగా జిల్లాలకు అందేలా, మధ్యలో రాష్ట్రం జోక్యం లేకుండా చేశారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు