నేడు ఏపీలో వర్షాలు.. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు..

నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

news18-telugu
Updated: December 5, 2019, 6:25 AM IST
నేడు ఏపీలో వర్షాలు.. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడ్డా.. బుధవారం నాడు కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, తూర్పు గాలుల తీవ్రత తగ్గడంతో రాష్ట్రంలో పలు చోట్ల చలి పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో శివారు ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగానే ఉండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 20.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గరిష్ఠంగా ఖమ్మంలో 31.0 డిగ్రీలుగా నమోదైంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 5, 2019, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading