విజయవాడకు చిరంజీవి దంపతులు... మధ్యాహ్నం సీఎం జగన్‌తో భేటీ
Andhra Pradesh : కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
news18-telugu
Updated: October 14, 2019, 11:29 AM IST

చిరంజీవి, సీఎం జగన్
- News18 Telugu
- Last Updated: October 14, 2019, 11:29 AM IST
Chiranjeevi : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణితో కలిసి విజయవాడకు బయల్దేరారు. మధ్యాహ్నం చిరంజీవి దంపతులు సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా చిరంజీవికి అక్టోబర్ 11న అపాయింట్మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్... ఆ తర్వాత 14కు పోస్ట్ పోన్ చేసింది. నేటి మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఏపీ ముఖ్యమంత్రిని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో చిరంజీవి దంపతులు కలవనున్నారు. వీళ్లు ఏం మాట్లాడుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణాలూ లేవని తెలిపారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి అంతగా మద్దతు రాలేదు. రాం చరణ్‌కి కూడా సీఎం నుంచీ ఆహ్వానం అందింది.
ఈ భేటీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని... ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాలని కోరనున్నారు చిరంజీవి. ఈ సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలు వేసేందుకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. ఈ సందర్భంగా ఏపీ సీఎంగా జగన్ ఎన్నికైనందుకు ఆయన్ని కలిసి చిరంజీవి అభినందనలు తెలపనున్నారు. మరోవైపు ఈ సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు కోరనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. ఆ సినిమాను చూసిన తెలంగాణ గవర్నర్ ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.
తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ... దాదాపు ఖరారు
ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీ
ఉత్తమ్‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం
విజయవాడకు చిరంజీవి దంపతులు... మధ్యాహ్నం సీఎం జగన్‌తో భేటీ#MegastarChiranjeevi #SyeraaNarashimaReddy #YSJaganMohanReddy #News18Telugu pic.twitter.com/G1ElCkXBSS
— News18 Telugu (@News18Telugu) October 14, 2019
టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ...
దిశ హంతకుల ఎన్కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
Loading...
Pics : అందం, అభినయాల కలయిక ప్రియాంక నల్కర్
ఇవి కూడా చదవండి :
తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ... దాదాపు ఖరారు
ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీ
ఉత్తమ్‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం
Loading...