హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Megastar Chiranjeevi: చిరంజీవి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారా..? రాహుల్‌కి రాసిన ఆ లేఖలో ఏముంది..?

Megastar Chiranjeevi: చిరంజీవి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారా..? రాహుల్‌కి రాసిన ఆ లేఖలో ఏముంది..?

 Chiranjeevi Twitter

Chiranjeevi Twitter

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో డైలాగ్ లా.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా.. లేదంటే అసలు రాహుల్ కు ఎందుకు లేఖ రాశారు.. ఆ లేఖలు ఏం ఉందని అనే చర్చ కొనసాగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన పదే పదే చెబుతున్నారు కూడా.. కానీ ఆయన్ను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. తాజాగా మరోసారి చిరంజీవి (Chiranjeevi) వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది. అది ఏంటంటే..? చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారా..? కాంగ్రెస్ అధిష్టానానికి ఇంకా టచ్ లోనే ఉన్నారా? ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాటల వెనుక ఉద్దేశమేంటి..? రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ అంటుంటే.. కాదు ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని పీసీసీ చీఫ్ ఎందుకు చెబుతున్నారు. అయితే ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం.. రాహుల్ గాంధీకి మెగాస్టార్ చిరంజీవి లేఖ రాయడమే అంటున్నారు.. మరి ఇంతకీ ఆ లేఖలో ఏముంది?

తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చిరంజీవి పదే పదే చెబుతున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అస్సలు సంబంధం లేదని మీడియా ముందే చెబుతున్నారు. తాను పక్క రాష్ట్రంలో ఉంటున్నానని చిరంజీవి చెబుతున్నా.. రాష్ట రాజకీయ నేతలు మాత్రం చిరంజీ తమ వాడు అంటే తమ వాడు అని చెప్పుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సైతం చిరంజీకి ఇంకా తమ పార్టీ నేతే అంటోంది.

చిరంజీవి తాను రాజకీయాలకు దూరం అంటారు.. కానీ ఏపీ పీసీసీ చీఫ్ మాత్రం ఇంకా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటారు. ఈ లాజిక్ అర్థం ఏంటనే చర్చ మొదలైంది. ఇటీవల ఆయన సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు తనకు దూరం కావడం లేదని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది.

ఇదీ చదవండి : వైసీపీకి ఆనం వీడ్కోలు చెబుతున్నారా..? ఆయన్ను వదిలించుకోవాలని పార్టీ ప్లాన్ చేసిందా..?

ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన గిడుగురుద్రరాజు ఈ ప్రకటన చేశారు.. అయితే ఇప్పటికిప్పుడు ఆయన ఈ ప్రకటన ఎందుకు చేసారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాను రాజకీయాలకు దూరం అని ఏ పార్టీలోనూ తాను లేనని పదేపదే చిరంజీవి ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆయన్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అంటే టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న చిరంజీవి.. తన సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు కూడా చిరంజీవి పేరుతో ఐడీ కార్డ్ కూడా విడుదల చేశారు. సాంకేతికంగా చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.. కానీ గత కొన్నేళ్లుగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు..

ఇదీ చదవండి: యువగళం పాదయాత్రకు లభించని అనుమతి.. తగ్గేదే లే అంటున్న లోకేష్.. నేతలకు కీలక సూచనలు

2014ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ ఎన్నికల్లోనూ…ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ప్రచారం కూడా చేసారు.. కానీ అటు దేశంలో..ఇటు రెండు తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవం తర్వాత ఎక్కడా ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు.. అంతేగాదు రీసెంట్ గా వైసీపీ మంత్రి రోజా తన కుటుంబంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన రిప్లై కూడా ఇచ్చారు.. తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానని అందులోనూ తాను పక్క రాష్ట్రమైన తెలంగాణలో నివాసముంటున్నానని తనకు ఏపీ పాలిటిక్స్ కు ఏమాత్రం సంబంధం లేదని కూడా చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేదన్నా ఆయన ఇటీవల రాహుల్ గాంధీకి లేఖ ఎందుకు రాశారు. ఏమని రాశారు? అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని కూడా చిరంజీవి కలవలేదు. మరి లేఖ ఎందుకు రాశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానన్న చిరంజీవి రాహుల్ కు లేఖ రాయాల్సిన అవసరం ఏంటన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్‌కి అభినందనలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగానే చిరంజీవి ఆ లేఖ రాసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Megstar chiranjeevi, Pawan kalyan

ఉత్తమ కథలు