హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mega Tweet: కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్.. వార్నింగ్ ఎవరికి?

Mega Tweet: కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్.. వార్నింగ్ ఎవరికి?

Chiranjeevi god father Photo twitter

Chiranjeevi god father Photo twitter

Mega Tweet: మెగా స్టార్ చిరంజీవి చుట్టూ పొలిటికల్ రచ్చ పెరుగుతోంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీని ఉద్దేశించే చిరంజీవి ట్వీట్ ఉందంటూ చర్చ మొదలైంది.. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Mega Star Chiranjeevi Tweet: కాంట్రాక్టుల పేరుతో జనాల సొమ్ము దోచుకుంటూ..  ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ చిరంజీవి చేసిన ట్వీట్  ఇఫ్పుడు వైరల్ అవుతోంది.. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. ఆయన ఆ సినిమాలో డైలాగ్ ను తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అయితే ఆ ట్వీట్ కు పొలిటికల్ టచ్ ఉండడంతో.. ఏపీలో అధికార వైసీపీని టార్గెట్  చేస్తూనే ఆయన  ట్వీట్ ఉంది అంటూ.. జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ట్వీట్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు రొడ్డు కాంట్రాక్టులు.. ఇసుక కాంట్రాక్టులు.. కొండ కాంట్రాక్టులు.. నీళ్ల కాంట్రాక్టులు.. మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు అంటూ.. ఆ ట్వీట్ లో ఉండడంతో.. ఇది ఆ పార్టీని ఉద్దేశించే ట్వీట్ చేశారని అభిప్రాయపడుతున్నారు.

  ఇంకా ఆయన ట్వీట్ లో ఏముంది అంటే..? ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు  నేను తీసుకుంటున్నా..? ఇందులో  ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం, తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ నసులో ఉండాలి  లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు..

  గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్ కి నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని

  చిరంజీవి  మాత్రం  గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్ కి నా అభినందనలు తెలుపుతూ.. అందులో డైలాగ్ లను ఈ ట్వీట్ రూపంలో వదిలారు.  కానీ రాజకీయ విశ్లేషకులు.. జనసైనికులు మాత్రం.. జనసేన పార్టీకి అండగానే ఈ ట్వీట్లు ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నారు.

  గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ కంటే ముందు నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పొలిటికల్ డైలాగ్ లు పేల్చడంతో.. ఈ సినిమా చుట్టూ రాజకీయ చర్చ ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘జన జాగృతి పార్టీ’లో కూడా జనసేన పార్టీ లాగా పిడికిలి బిగించి ఉండటం.. తమ్ముడు పనవ్ కళ్యాణ్‌కు రాజకీయంగా ఉపయోగపడేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. జనసేనది JSP అయితే.. గాడ్ ఫాదర్ మూవీలో JJP గా చూపించారు. జనసేన కార్యకర్తలు.. పవన్ అభిమానులు మాత్రం.. గాడ్ ఫాదర్ తో.. చిరంజీవి తమ్ముడికి మద్దతుగా నిలుస్తున్నారన్నది క్లారిటీ వచ్చేసింది అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chiranjeevi, God Father Movie, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు