Home /News /andhra-pradesh /

MEGASTAR CHIRANJEEVI MEETS YS JAGAN AND DISCUSSED ABOUT TOLLYWOOD ISSUES FULL DETAILS HERE PRN

Chiru meets Jagan: సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ.. మెగాస్టార్ చెప్పిన పాయింట్స్ ఇవే..!

సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ

సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. ఈ సమావేశంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టికెట్ ధరలపై అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. గురువారం మధ్యాహం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి.. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన లంచ్ మీటింగ్ తో సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యలు (Tollywood Issues), ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. గంటా 15 నిముషాల పాటు సాగిన సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చ్చించారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి కలుస్తున్నానని చిరంజీవి జగన్ తో

    సీఎం జగన్ తో సమావేసం చాలా సంతృప్తిగా జరిగిందని చిరంజీవి అన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మద్య తర్జనభర్జనలు నెలకొన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరు తెలిపారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని.. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్ కు వివరించినట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: కరోనా థర్డ్ వేవ్ లో ఆనందయ్య మందుకు బ్రేక్.. ఆయుష్ శాఖ నోటీసులు.. అసలేం జరిగిందంటే..!


    సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించేంత గ్లామర్ లేదని.. ఇండస్ట్రీలోని కార్మికులకు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఉందని చిరంజీవి అన్నారు. అలాంటి పేద కార్మికులను ఆదుకోవల్సిన బాధ్యత ఉందని తెలిపారు. థియేటర్ల యాజమాన్యాలకు కూడా ధైర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు చిరంజీవి. ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ తెలిపారు.

    ఇది చదవండి: వైసీపీకి షాకిచ్చేలా రఘురామ వ్యూహం.. ఇతర పార్టీలదీ అదే పరిస్థితి.. అందుకే ఆ నినాదమా..?


    అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. ఎవరూ భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు సినిమా రంగంలోకి వ్యక్తులు సంయమనం పాటించాలని.. కంగారుపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నసినిమాలకు సంబంధించి ఐదో షో ఉండాలన్న విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారని చిరు తెలిపారు.

    ఇది చదవండి: 2014 సీన్ 2024లో రిపీట్ కాబోతోందా..? ఏపీలో ఆ పార్టీకి అదే మైనస్ అవుతుందా..?

    సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందునే ఒక్కడినే వచ్చానని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ వివదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని చిరు అన్నారు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Megastar Chiranjeevi

    తదుపరి వార్తలు