హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Megastar Chiranjeevi: రాజమండ్రిలో చిరంజీవి పర్యటన.. కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

Megastar Chiranjeevi: రాజమండ్రిలో చిరంజీవి పర్యటన.. కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

(Image-Twitter)

(Image-Twitter)

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం వై-జంక్షన్‌లో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని (statue of Allu Ramalingaiah) ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆవిష్కరించారు.

ఇంకా చదవండి ...

  మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం వై-జంక్షన్‌లో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని (statue of Allu Ramalingaiah) ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల ఆవరణలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.2 కోట్ల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. అల్లు రామలింగయ్యతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు రామలింగయ్యతో (Allu Ramalingaiah) తనకున్నది కేవలం మామాఅల్లుళ్ల బంధం మాత్రమే కాదని.. తమది గురు-శిష్యుల సంబంధం వంటిందని చెప్పారు. ఘాటింగ్‌లలో బిజీగా ఉండడం వలన సమయానికి భోజనం చేయకలేకపోయేవాడినని.. దాంతో కడుపులో మంట వచ్చేదని అన్నారు. మంట తగ్గడానికి ఎన్ని మందులు వాడిన లాభం లేకుండా పోయిందన్నారు. కానీ అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హెూమియో మందుతో కడుపులో మంట పోయిందని గుర్తుచేసుకున్నారు.

  ఇప్పటికీ తన ఫ్యామిలీలో హెూమియోపతి (Homeopathy) మందులే వాడతామని చిరంజీవి అన్నారు. హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. రాజ్యసభ ఎంపీగా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని చెప్పారు. హెూమియోపతి సంజీవని లాంటి వైద్యమని కొనియాడారు. హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, దీనికి మరింత ప్రాచుర్యం రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య స్పూర్తి ప్రదాత అని అన్నారు. తన చిన్నతనం లో హోమియో పతి ని ఉమాపతిగా పలికేవాడినని చిన్ననాటి రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తన మొదటి మూడు సినిమాలు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగాయని అన్నారు.

  Doctors Cum Actors in Tollywood: అల్లు రామలింగయ్య, రాజశేఖర్, సాయి పల్లవి సహా టాలీవుడ్ డాక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరెరున్నారో మీరే చూడండి..

  మనఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలోనే నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. అల్లు రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన అనుకుంటే ఏదైనా,సాధించేవారని చెప్పారు. హోమియో పతి వైద్యం అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారని అన్నారు. హొమియోపతి వైద్యం లో ఏ రోగానికి అయినా మందు వుంటుందని తెలిపారు.

  కాలేజీ భవనానికి నిధులు కేటాయించినది తన డబ్బులు కాదు అని అన్నారు. తన రాజ్యసభ నిధుల నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చినట్టుగా వివరించారు. అంతకుముందు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ వద్ద మెగా స్టార్ చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక, ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Allu aravind, East godavari, Megstar chiranjeevi

  ఉత్తమ కథలు