హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nagababu: దేశ తదుపరి రాష్ట్రపతిగా ఆయన ఉండాలి.. మెగాబ్రదర్ నాగబాబు ప్రతిపాదన

Nagababu: దేశ తదుపరి రాష్ట్రపతిగా ఆయన ఉండాలి.. మెగాబ్రదర్ నాగబాబు ప్రతిపాదన

నాగబాబు

నాగబాబు

Nagababu: దేశం మొత్తాన్ని ఒక కుటుంబంలా చూసే రతన్ టాటాను తాను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తున్నానని నాగబాబు అన్నారు.

వచ్చే ఏడాదిలో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఆయన తరువాత దేశ ప్రథమ పౌరుడి స్థానంలో ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రాజకీయవర్గాల్లో దీనిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దేశ తదుపరి రాష్ట్రపతిగా ప్రముఖ బిజినెస్‌మేన్, టాటా గ్రూప్ సారథి రతన్ టాటా ఉండాలని టాలీవుడ్ నటుడు, మెగాబ్రదర్ నాగబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్న నాగబాబు.. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఆలోచనలు, మనసు ఉన్న వ్యక్తి రాష్ట్రపతి కావాలని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తాన్ని ఒక కుటుంబంలా చూసే రతన్ టాటాను తాను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తున్నానని అన్నారు.

ఇదే అంశంపై నాగబాబు స్పందించారు. దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రతన్ టాటా లాంటి వాళ్లు రాష్ట్రపతి కావడం అవసరమని అభిప్రాయపడ్డారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారని.. అదే విధంగా రతన్ టాటాను కూడా దేశ ప్రథమ పౌరుడి స్థానంలో నిలిపితే ఆయన మేథస్సు దేశానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన మంచి వ్యాపారవేత్త మాత్రమే కాదని.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి అయితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.


ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇటు అధికార ఎన్టీయే కూటమి, అటు విపక్షాలు ఎవరిని బరిలో నిలుపుతాయనే అంశం ఆసక్తి రేపుతోంది. విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో ఉంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈరకంగా విపక్షాలన్నీ కలిసి ఎన్డీయేకు షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే తదుపరి రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ, ప్రధాని మోదీ మనసులో ఏముందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

First published:

Tags: President of India, Ratan Tata

ఉత్తమ కథలు