Naga Babu: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో మొన్నటి వరకు టాలీవుడ్ (Tollywood) వర్సెస్ ఏపీ ప్రభుత్వం (AP Government) గా ఉన్న వివాదం.. సద్దు మణిగింది అనుకున్నారు అంతా.. అయితే ఆ వివాదం ఇప్పుడు భీమ్లా నాయక్ (Bheemla Nayak) వర్సస్ ప్రభుత్వంగా మారింది. కేవలం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై కక్షతోనే భీమ్లా నాయక్ కు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోంది ఇటు పవన్ ఫ్యాన్స్.. అటు రాష్ట్రంలో విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.. డీజే టిల్లు సినిమా వరకు లేని ఆంక్షలు పవన్ సినిమా రిలీజ్ అయ్యే సరికి గుర్తు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. సినిమా ప్రముఖులను పిలిచి టాలీవుడ్ కు అండగా నిలుస్తామని.. పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం జగన్.. భీమ్లా నాయక్ సినిమా ముందు ఎందుకు మనసు మార్చుకున్నారని నిలదీస్తున్నారు.. అంతేకాదు రేట్లు పెంచుతామంటే చర్యలు తీసుకుంటామని.. ఐదో షో వేస్తామంటే థియేటర్ సీజ్ చేస్తామని ఆదేశాలు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పలు థియేటర్లలో ప్రదర్శన కూడా నిలిచిపోయిందని.. అయినా ప్రభుత్వం ఎందుకు కల్పించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను థియేటర్లకు పంపించి కాపాల కాయించాల్సిన పరిస్థితి ఎప్పుడు చూడలేదని.. ఇంద కుట్ర కాదా అని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎంతలా అంహకారం చూపించినా.. పవన్ ఆత్మగౌరవమే గెలిచింది అంటున్నారు జన సైనికులు..
తాజాగా ఇదే అంశంపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం, వైస్ జగన్ పవన్ కళ్యాణ్ పై పగ పట్టారని ఆయన ఆరోపించారు. సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కోపం ఉంటే తన మీద చూపించు అన్నందుకే సీఎం జగన్ పగబట్టి ఇలా సినిమాల విడుదల విషయంలో వేధిస్తున్నారని అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో పాటు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ విధానంపై సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఒకరిద్దరు మినహా ఎవరు ఏం మాట్లాడడం లేదన్న నాగబాబు.. సినిమా రిలీజ్ కి అనేక ఇబ్బందులు సృష్టిస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు దైర్యంగా ముందుకు రావటం లేదన్నారు. ప్రశ్నిస్తే చంపుతారా.. లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అంటూ ప్రశ్నించారు. ఇలాగే మీ పాలన ఉంటే.. ఈ ఐదేళ్లే మీకు డెడ్ లైన్ అని.. మరోసారి అధికారం గురించి మరచిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
#Bheemlanayak || Nagababu on bheemla Nayak || మీ పాలనకు ఇదే ఆఖరు || జగన... https://t.co/ZIaJMlCC9l via @YouTube #BheemlaNayak #BheemlaNayakDay #PawanaKalyan #NagaVamsi #Jagan @Pavan_koppolu @PawanKalyan_PS @PawanKalyan_PS @TJSPartyOnline @Pawankhera
— nagesh paina (@PainaNagesh) February 26, 2022
ఆంధ్రప్రదేశ్ ను ఉత్తర కొరియా మాదిరి నియంతలా పాలిస్తాను అంటే కుదరదు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు మాత్రమే అధికారం ఉంటుందని.. ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన తప్పులు.. అన్నీ ప్రజలకు గుర్తు ఉంటాయన్నవిషయం తెలుసుకోవాలి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజల ముందుకే వెళ్లాలని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక, సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తే కళ్యాణ్ బాబుకు వచ్చే నష్టమేమీ లేదని.. సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలకు నష్టం వస్తుందని.. ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్టయిందని.. ప్రేక్షకులు ఔట్ ఆఫ్ ది వే సినిమాను ఆదరించారని లేకపోతే నిర్మాతలు నష్టపోయే వాళ్ళని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Bheemla Nayak, Mega brother nagababu, Pawan kalyan