MEGA BROTHBER NAGA BABU FIRE ON ONCE AGAIN AP GOVERNMENT THEY TRYING TO DISPUTES BETWEEN MEGA FAMILY NGS
Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య విబేధాలు.. అదే వారి లక్ష్యం అంటూ నాగబాబు ఫైర్
జగన్ సర్కార్ కు నాగబాబు వార్నింగ్
Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య మనస్పర్ధల కోసం కుట్రలు చేస్తున్నారా..? మెగాస్టార్ చిరంజీవిని.. పవన్ కు దూరంగా ఉంచేలానే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా..? అవుననే అంటున్న మరో మెగా బ్రదర్ నాగబాబు.. ఏపీ అధికార వైసీపీ నేతలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని.. అన్నదమ్ముల మధ్య తగువులు పెట్టడమే వారి లక్ష్యం అంటూ ఆరోపించారు.
Mega Brothers: భీమ్లా నాయక్ (Bheemla Nayak) చుట్టూ ముసురుకున్న రాజకీయ చల్లారడం లేదు.. సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు దాటిన వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇదంతా వైసీపీ (YCP) చేస్తున్నా కుట్రలు అని మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం (AP Government) పాలనపై ఫోకస్ చేయకుండా.. కేవలం రాజకీయ కుట్రలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. పగ, ప్రతీకారంతో పాలన చేయవద్దని, ఒక మాట అనగానే ఎందుకంత పౌరుషం అంటూ నాగబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు అన్నింటికీ అతీతులా అని ఆయన నిలదీశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhr Pradesh) మంత్రులు వాడే భాష సామాన్యులు కూడా వాడడం లేదన్నారు. మరి మంత్రులు మితిమీరి మాట్లాడుతున్నా.. సీఎం ఒక్క మాట కూడా అనడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ (Tollywood)కు మధ్య గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల రగడ కొనసాగుతోంది. ఆ వివాదం సద్దుమణుగుతోందని త్వరలోనే సీఎం శుభవార్త చెబుతారనుకున్న సమయంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల అవ్వడం వివాదం మరో లెవెల్ కు వెళ్లింది. భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇటీవలే వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తామంటూ తాము చాలా సంతోషిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని పరిశ్రమగా గుర్తించాయా? తమకు ఫైనాన్స్ లు ఇచ్చి టికెట్ ధరలు మీ ఇష్టమొచ్చినట్లు పెట్టండని సలహా ఇచ్చారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ లపై తాము తీవ్ర విమర్శలు చేశామని.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని గుర్తు చేశారు. అన్నయ్య చిరంజీవికి తమకు మధ్య విబేధాలు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని విబేధించారు కాబట్టే పవన్ ను టార్గెట్ చేశారా? అని నాగబాబు నిలదీశారు.
వైసీపీ ప్రభుత్వానికి మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదన్నారు. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో ఉండాలనే దానికి తాను ఏకీభవిస్తున్నట్లు, సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెరగాలంటే రిచ్ నేస్ తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టోటల్ సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యునరేషన్ లు పది లేదా పన్నెండు పర్సెంట్ ఉంటుందన్నారు. రెమ్యునరేషన్ ఖర్చు కాదు… అనే అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏమి అర్థం అవుతోందన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.