Home /News /andhra-pradesh /

MEDICINE IS FOR IMMUNITY NOT FOR OMICRON AANANDAYYA SNR

నేనిస్తోంది వ్యాధి నిరోధక మందు మాత్రమే..ఒమిక్రాన్‌కి కాదు..

Aanandayya(ఫైల్‌ ఫోటో)

Aanandayya(ఫైల్‌ ఫోటో)

Aanandayya: కరోనా మందుతో బాగా ఫేమస్ అయిన కృష్ణపట్నం ఆనందయ్య ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కొత్తగా పంపిణి చేస్తోంది ఒమిక్రాన్‌కి మందననే జరిగిన ప్రచారంతో ప్రభుత్వం ఆయన్ని వివరణ కోరింది. మందు పంపిణికి మీదగ్గరున్న అనుమతులు ఏమిటన్న ప్రశ్నలపై ఆయన తన వెర్షన్ వెల్లడించారు.

ఇంకా చదవండి ...
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య పేరంటే ..ఆ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో పాపులర్ అయింది. కరోనా సమయంలో ప్రకృతి వైద్యంతో చాలా మందికి నాటు వైద్యుడిగా పరిచమయ్యారు ఆనందయ్య. కానీ ఇప్పుడు అనేక విమర్శలు ఆయన్ని చుట్టుముట్టాయి. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు దేశ వ్యాప్తంగా పెరగడంతో ఆయన ఓ మందును పంపిణి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది ఒమిక్రాన్‌ని నయం చేసే మందంటూ ప్రచారం జరగడంతో ఇక్కడే సమస్య మొదలైంది. ఒమిక్రాన్‌ లక్షణాలు, దానికి తగిన వైద్యం కనుగొనేలోపే ఆనందయ్య కొత్త మందును పంపిణి చేయడంపై హేతువాదులు, ఆయుష్ వంటి ఔషద తయారిదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఎలాంటి ఔషద అనుమతులు లేవని ఆరోపిస్తున్నారు.

ఒమిక్రాన్‌ మందు కాదు..వ్యాధి నిరోధక మందే..
మరోవైపు ఆనందయ్య స్వస్థలమైన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసులు కూడా ఈ మందు పంపిణి నిలిపివేయాలని పట్టుబట్టారు. మందు పంపిణి చేయడం వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చే వేలాది మంది రోగులతో మళ్లీ తమకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని కృష్ణపట్నంలోని స్థానికులు ఆనందయ్య ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆనందయ్య పంపిణి చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి..? ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు అంటూ ఇచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కోరింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు..వారం రోజుల్లోగా పూర్తి వివరాలు అందజేయాలని నెల్లూరు జిల్లా జేసీ ద్వారా నోటీసులు కూడా పంపింది. మందుపై జరుగుతున్న రాద్ధాంతంతో ఆనందయ్య నోరు విప్పారు. తాను ఉచితంగా పంపిణి చేస్తోంది ఒమిక్రాన్‌కు మందని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం రోగ నిరోధక మందని చెప్పుకొచ్చారు. అంతే కాదు..ప్రభుత్వం నుంచి నోటీసులు రావడం, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో..ఇప్పటికే మందు పంపిణి నిలిపి వేసినట్లుగా స్పష్టం చేశారు ఆనందయ్య. గ్రామంలో తనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై విచారం వ్యక్తం చేశారు ఆనందయ్య. తాను ఇదంతా డబ్బు కోసం చేయడం లేదని..స్వచ్ఛందంగా చేస్తున్నట్లు తెలిపారు.

కొత్త మందుపై జరుగుతున్న రగడ..
ఆనందయ్య కొత్త మందు పంపిణికి సంబంధించిన అనుమతులు, వివరణ ఇవ్వడానికి వారం గడువు ఇచ్చారు జిల్లా అధికారులు. ఆ టైమ్‌లోగా వివరాలు అందజేయని పక్షంలో చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త మందు పంపిణి విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని .. తనకు సహాయ, సహకారాలు అందించాలని ఆనందయ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్పందించిన నాటు వైద్యుడు..
కరోనా మహమ్మారిని నయం చేసేందుకు ప్రకృతిలో దొరికే మూలికలు, ఆకులు ఇతర పదార్ధాలతో మందు తయారు చేసి నాటు వైద్యుడిగా బాగా ఫేమస్ అయ్యారు ఆనందయ్య. కరోనాకు వ్యాక్సిన్ రావడం, వైరస్ వ్యాప్తి తగ్గిపోవడంతో ఆయన పేరు వార్తల్లో లేకుండా పోయింది. కాని ఇప్పుడు ఒమిక్రాన్‌ కేసులు దేశ వ్యాప్తంగా పెరగడంతో ఆనందయ్య పేరు మళ్లీ బాగా వినిపిస్తోంది. అయితే ఫస్ట్‌ టైమ్‌ ఆయన పంపిణి చేసిన మందుపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికి చాలా మంది నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నానికి వెళ్లి మరీ మందు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ విజృంభణతో మళ్లీ ఆయన మందు పంపిణి చేస్తున్నాడన్న వార్తలపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Anandaiah corona medicine, Corona alert, Corona campaigned

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు