మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...

AP Assembly Election 2019 : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తే... మే 26 నే జగన్ సీఎంగా ప్రమాణం చెయ్యడం అత్యుత్తమం అంటున్నారు జ్యోతిష్యులు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 6:53 AM IST
మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
2014లో కలిసిరాకపోయినా... 2019లో మాత్రం వైసీపీ అధినేత జగన్‌కి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు. జగన్ జాతకాన్ని బట్టీ ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమంటున్నారు. వైసీపీ ఏపీలో అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు ప్రముఖ దేవనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుయాజీ. విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో శ్రీ విద్యా సర్వమంగళాదేవి పీఠంలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. కలచక్రగమనం స్థితిగతులు జగన్‌కి కలిసొస్తున్నాయని అన్నారు. మార్చి 27 నుంచీ ఏప్రిల్ 12 వరకూ... 17 రోజులపాటూ వైసీపీ కార్యకర్తలు కోరడంతో నీలపతాకసహిత రాజశ్యామల యాగం చేసినట్లు ఆయన వివరించారు. జగన్ నుంచీ వరుణ ప్రధానం తీసుకొని... యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దేవనాడీ కాలచక్ర గ్రహగతులను బట్టీ అప్పట్లోనే చెప్పామన్న కాళిదాసుయాజీ... ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణితో పాటూ, పార్టీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల మేళవింపుతో ముహూర్తాన్ని నిర్ణయించినట్లు... ఆ రెండు నక్షత్రాల బలాల పరిశీలన తర్వాత మే 26 ఉదయం 9.20 నిమిషాలకు సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం శుభ ముహూర్తం ఉన్నట్లు నాజీ జ్యోతిష్యం చెబుతోందని ఆయన వివరించారు. వైసీపీకి 107 నుంచీ 115 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

జగనే కాదు ఎవరైనా సరే... ప్రమాణ ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలంటే... రెండు నక్షత్రాల మేళవింపును లెక్కలోకి తీసుకోవాలంటున్నారు కాళిదాసుయాజీ. అలా చేసినట్లైతే... ఆ ముహూర్తంలో ప్రమాణం చేసిన వారు... రాష్ట్రం చక్కగా అభివృద్ధి చెందడమే కాదు... అన్ని గ్రహాలూ అనుకూలిస్తాయనీ, పాలకులకు కూడా కలిసొస్తుందని ఆయన చెబుతున్నారు. ఒకప్పుడు రాజులు కూడా ఇలాగే చేసేవారని తెలిపారు. జగన్ సీఎం అవుతారని ఇప్పటికే కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన ఎప్పుడు ప్రమాణం చేస్తే మంచిదో కూడా తమదైన లెక్కలు వేసి వివరిస్తున్నారు. వీటిని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నా... మంచి విషయాలు ఎవరు చెప్పినా వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...
First published: April 28, 2019, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading