ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) లోని ఆర్ఏంహెచ్.పి విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో కోటిన్నరకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Visakhapatnam, Vizag Steel Plant