Home /News /andhra-pradesh /

MARRIED WOMAN SUSPECT DEATH IN WEST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Married Woman: మూడు నెలల క్రితమే పెళ్లి.. మంచి ఉద్యోగం.. కానీ ఇంతలోనే అలా చేస్తుందనుకోలేదు..

అశ్వినీ (ఫైల్)

అశ్వినీ (ఫైల్)

Death Mystery: ఆమెకు పెళ్లై మూడు నెలలైంది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్. సంక్రాంతి పండగ కూడా సంతోషంగా జరుపుకుంది. కానీ ఇంతలో ఏమైందో కాలువలో శవమై తేలింది. ఆమె ఎందుకు ఎలా చేసిందో ఎవరికీ అంతుపట్టం లేదు.

    ఆమెకు పెళ్లై మూడు నెలలైంది. హైదరాబాద్ (Hyderabad) లో సాఫ్ట్ వేర్ జాబ్. సంక్రాంతి పండగ (Sankranthi Festival) కూడా సంతోషంగా జరుపుకుంది. కానీ ఇంతలో ఏమైందో కాలువలో శవమై తేలింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) మొగల్తూరు మండలం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు, తులసి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్వని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వెండ్ర రామకృష్ణతో పెళ్లైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె.. సంక్రాంతికి భర్తతో కలిసి పుట్టిల్లైన కాళీపట్నం వచ్చింది. పండగ తర్వాత భర్త రామకృష్ణ హైదరాబాద్ వెళ్లిపోయాడు.

    ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి తన బైక్ పై ఒంటరిగా ముత్యాలపల్లివైపు వెళ్లిన అశ్విని.. వంతెన వద్ద బైక్, తన వస్తువులను ఉంచి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అశ్వినీ ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఉప్పుటేరు వద్ద ఆమె స్కూటీ ఉండటం చూసి అందులో గాలించగా మృతదేహం లభ్యమైంది. గత ఏడాది అశ్విని తండ్రి ధర్మారావు కరోనాతో మృతి చెందారు. అప్పటి నుంచి దిగులు ఉంటున్న అశ్విని.. తండ్రి లేడనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.

    ఇది చదవండి: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..


    తల్లి తులసి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే భర్తతో ఏమైనా విభేదాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసిన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

    ఇది చదవండి: అతడికి 19, ఆమెకు 16.. ఇద్దరి మధ్య ప్రేమ.. ఇంతలో ఊరి చివర అడవిలో షాకింగ్ దృశ్యం..


    ఇటీవల విజయవాడలో ఇలాంటి ఘటనే జరిగింది. నున్న పరిధిలోని వాంబేకాలనీకి చెందిన బిట్రా ప్రసాద్, వరలక్ష్మికి నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక పాప కూడా ఉంది. ప్రసాద్ రోజువారీ కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈనెల 19వ పనికి వెళ్లిన ప్రసాద్ సాయంత్రం తిరిగొచ్చేసరికి ఇంటి తలుపు వేసి ఉంది. ఎంత పిలిచినా భార్య తలుపు తీయకపోయే సరికి అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఆమె ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుందనేది తెలియలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త ప్రసాద్ తో పాటు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Suicide, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు