హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Married Women: కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి.. అంతపని చేయాలా..?

Married Women: కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి.. అంతపని చేయాలా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: భర్త సొంతింటికి రమ్మంటే హారిక వెళ్లలేదు. దీంతో అతడొక్కటే వెళ్లాడు. ఇంతలో భర్త ఫోన్ మోగింది.. ఎత్తగానే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఒకే ప్రాంతంలో రెండిళ్లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

క్షణికావేశం ఎవరితో ఎంతటి పనైనా చేయిస్తుంది. కొన్నిసార్లు హత్యలకు ఉసిగొల్పితే మరికొన్నిసార్లు ఆత్మహత్యలకు ప్రేరేవిస్తుంటాయి. ఇక కొందరు చిన్నచిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తుంటారు. భర్త పుట్టింటికి పంపలేదని.. పట్టుచీర కొనివ్వలేదని.. భార్య అలిగిందని.. ఇలా కాసేపు మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యలకు.. ఏకంగా ప్రాణాలు తీసుకుంటుంటారు. అలాగే ఇద్దరు మహిళలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని పిల్లలను తల్లిలేనివారిని చేశారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) రూరల్ మండలం ఎనికేపాడుకు చెందిన గాడి హారిక స్థానికంగా ఓ రెడీమేడ్ షాపులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తోంది. ఆమె తల్లి కూడా అదే షాపులో పనిచేస్తోంది. భర్త, తల్లి, కుమార్తెతో కలిసి ఎనికేపాడులోని నివాసముంటోంది. భర్త ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి నున్నలో సొంత ఇల్లు ఉంది. రెండు రోజులుగా తన ఇంటికెళ్దామని కోరాడు.

కానీ అందుకు హారిక నిరాకరించింది. దీంతో భర్త ఒక్కడే నున్న వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన హారిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం తల్లి విధులు ముగించుకొని ఇంటికి రాగా ఫ్యానుసు వేలాడుతూ కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై మృతురాలి తల్లి, భర్తను విచారిస్తున్నారు.

ఇది చదవండి: రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్న యువతి.. తర్వాతి రోజు మధ్యాహ్నం షాకింగ్ దృశ్యం..



ప్రసాదంపాడులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రామంలోని బల్లెంవారి వీధికి చెందిన వెంకటలక్ష్మి, భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. భర్త విజయవాడలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ భర్త ఇంట్లోలేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే వెంకట లక్ష్మి బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఆమె జీవితమైన ఊహించుకున్నంత అందంగా లేదు.. పెళ్లైన కొన్నాళ్లకే..


అనంతపురం జిల్లా (Anantapuram District) లోని ధర్మవరం పట్టణం నేసేపేటకు చెందిన వెంకటకృష్ణకు కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె సుజనకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వెంకటకృష్ణ తాడిమర్రి ఎస్బీఏలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇది చదవండి: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో ఉంటే వాళ్లే భర్తగా పరిచయం.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్..!


పెళ్లి సమయంలో రూ.18లక్షల క్యాష్, 30 తులలా బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. ఐతే పెళ్లి తర్వాత సుజన అనుకున్నదొకటి అయినది మరొకటి.. కొన్నాళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదుగానీ వారుండే ఇంట్లోని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లిన సుజన మళ్లీ తిరిగిరాలేదు. తలుపులు మూసి ఉండటంతో కుటుంబ సభ్యులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.

First published:

Tags: Andhra Pradesh, Vijayawada, Wife suicide

ఉత్తమ కథలు