హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore Woman: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం... కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..

Nellore Woman: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం... కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: ఈ రోజుల్లో వివాహ బంధాల కంటే క్షణిక సుఖాల కోసం ఏర్పడే అక్రమ సంబంధాలకే చాలా మంది ప్రాధాన్యతనిస్తున్నారు. చిన్నపాటి వివాదాలను సాకుగా చూపి కట్టుకున్నవాళ్లకి దూరంగా ఉంటే.. తాత్కాలిక బంధాల కోసం వెంపర్లాడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇంకా చదవండి ...

ఈ రోజుల్లో వివాహ బంధాల కంటే క్షణిక సుఖాల కోసం ఏర్పడే అక్రమ సంబంధాలకే చాలా మంది ప్రాధాన్యతనిస్తున్నారు. చిన్నపాటి వివాదాలను సాకుగా చూపి కట్టుకున్నవాళ్లకి దూరంగా ఉంటే.. తాత్కాలిక బంధాల కోసం వెంపర్లాడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా భర్తకు దూరంగా ఉంటే.. మరొకరికి దగ్గరైన మహిళ అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు (Nellore) నగరంలోని రామచంద్రాపురం బాలాజీనగర్ కు చెందిన సంపూర్ణ అనే మహిళ 11ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీస్టాల్ నిర్వహిస్తున్న వేణు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సంపూర్ణ పొదలకూరు రోడ్డులోని పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది. ఐతే మూడేళ్ల క్రితం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.

అప్పటి నుంచి అదే గ్రామంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది సంపూర్ణ. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ ఆమె ఇంటికి వస్తున్న ఆటోడ్రైవర్ ఆమెతో గడిపి వెల్లిపోయేవాడు. ఇదిలా ఉంటే ఈనెల 20న రాత్రి అతడు.. సంపూర్ణ దగ్గరికి వచ్చి వెళ్లాడు. శనివారం ఉదయం ఆమె ఇద్దరు కూతుళ్లు తల్లిని నిద్రలేపగా లేవలేదు. దీంతో అమ్మమ్మ జయమ్మకు సమాచారం ఇవ్వగా వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇది చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం..


ఐతే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సంపూర్ణ మెడపై గాయాలను గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకునన్నారు. సంపూర్ణకు ఆమె ప్రియుడికి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా..? ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..


ఇదిలా ఉంటే ఇటీవల గుంటూరు జిల్లా (Guntur District) లో ఇలాంటి ఘటనే జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన మహిళను కూడా వివాహేతర సంబంధం బలితీసుకుంది. భర్త పని నిమిత్తం తిరుపతికి వెళ్లగా.. ఆమె మరో యువకుడికి దగ్గరైంది. కొన్నాళ్లుగా అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. సదరు యువకుడు తన స్నేహితుడితో కూడా గడపాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె విషయం ఎవరికైనా చెప్తుందేమోనన్న భయంతో గొంతు నులిమి హత్య చేశారు. ఐతే ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందింతులను అరెస్ట్ చేశారు. ఇది జిల్లాలో మరో మహిళను ఆమె ఇద్దరు ప్రియులు పక్కా స్కెచ్ తో వెంటాడి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Nellore Dist

ఉత్తమ కథలు