MARRIED WOMAN COMMITS SUICIDE AFTER HUSBAND HAVING EXTRAMARITAL AFFAIR IN SRIKAKULAM DISTRICT FULL DETAILS HERE PRN
పెద్దకూతురు చనిపోతే.. చిన్నకూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు.. కానీ అల్లుడు అంతపనిచేస్తాడనుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం
Wife and Husband: మొదటి కాన్పు సమయంలో పెద్ద కుమార్తె అరుణ కుమారి మృతి చెందింది. బిడ్డ బ్రతికి తల్లి మృతి చెందడంతో చలించిపోయిన దుర్గారావు తన మూడో కుమార్తె ఉషారాణిని సోమినాయుడికి ఇచ్చి రెండో పెళ్లి జరిపించాడు.
అన్నో ఆశలతో పెద్దకూతుర్ని ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ తండ్రి. ఐతే విధి వింతచూపు చూడటంతో ఆమె బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే చనిపోయింది. ఐతే అల్లుడి బాధ, తల్లిని కోల్పోయిన పసిబిడ్డను చూడలేక మూడో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. ఐతే అల్లుడు చేసిన పనికి ఆమె కూడా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన సోమినాయుడికి 2009లో బక్కూరు గ్రామానికి చెందిన దుర్గారావు తన పెద్దకుమార్తె అరుణ కుమారిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఐతే మొదటి కాన్పు ప్రసవ సమయంలో అరుణ కుమారి మృతి చెందింది. బిడ్డ బ్రతికి తల్లి మృతి చెందడంతో చలించిపోయిన దుర్గారావు తన మూడో కుమార్తె ఉషారాణిని సోమినాయుడికి ఇచ్చి రెండో పెళ్లి జరిపించాడు. వీరికి ఒక పాప పుట్టింది.
కొంతకాలం కడపలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసిన సోమినాయుడు.. గత ఎనిమిదేళ్ల క్రితం విజయనగరం జిల్లా (Vizianagaram District) రామభద్రాపురం మండల కేంద్రానికి వచ్చేశాడు. అప్పటి నుంచి శ్రీరామ్ నగర్ కాలనీలో అద్దెంట్లో ఉంటూ ఇనుప స్క్రాప్, కోళ్ల ఫారమ్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమినాయుడుకు ఉషారాణికి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. అందుకు కారణం భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సోమినాయుడి నిర్వాకాన్ని భార్య నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో ఉషారాణి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఐతే ఘటనపై పోలీసులకు సమాచారమివ్వని సోమినాయుడు.. స్నేహితుల సాయంతో అంబులెన్స్ లో భార్య మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండంలం బుక్కూరులోని ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. దీంతో ఉషారాణి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఐతే తమ కుమార్తె చావుకు అల్లుడే కారణమని భావించిన దుర్గారావు.. సోమినాయుడిపై పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అల్లుడి వేధింపులతోనే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పాలకొండ పోలీసులు కేసను రామభధ్రాపురం పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రామభద్రాపురం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఆదారాలను సేకరించారు. పొత్తిళ్లో ఉన్న మనవరాలికి తల్లిని ఇవ్వాలనే ఉద్దేశంతో తన మూడో కుమార్తెను సోమినాయుడికి ఇచ్చి పెళ్లిచేశానని.. కానీ అల్లుడి నిర్వాకానికి మరో కుమార్తెను కూడా కోల్పోవలసి వచ్చిందని దుర్గారావు దంపతులు విలపిస్తున్నారు. అల్లుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.