Home /News /andhra-pradesh /

MARRIED WOMAN COMMITS SUICIDE AFTER FACING DOWRY HARASSMENT IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Married Woman: ఆమె జీవితమైన ఊహించుకున్నంత అందంగా లేదు.. పెళ్లైన కొన్నాళ్లకే..

భర్తతో సుజన (ఫైల్)

భర్తతో సుజన (ఫైల్)

Death Mystery: వారి పెళ్లైన తర్వాత కొన్నాళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదుగానీ వారుండే ఇంట్లోని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లిన సుజన మళ్లీ తిరిగిరాలేదు.

  ప్రతి ఒక్కరి జీవితం పెళ్లికి ముందు ఒకలా.. పెళ్లికి తర్వాత మరోలా ఉంటుంది. అతికొద్దిమందికే జీవితం అనుకున్నట్లు సాగుతుంది. అలా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నవారు ఆ తర్వాత పరిస్థితులు తలకిందులవడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నబిడ్డల్ని, జన్మనిచ్చిన వారి గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఓ యువతి ఇలాగే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిచింది. కన్నవారికి కడుపుశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనంతపురం జిల్లా (Anantapuram District) లోని ధర్మవరం పట్టణం నేసేపేటకు చెందిన వెంకటకృష్ణకు కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె సుజనకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వెంకటకృష్ణ తాడిమర్రి ఎస్బీఏలో ఉద్యోగం చేస్తున్నాడు.

  పెళ్లి సమయంలో రూ.18లక్షల క్యాష్, 30 తులలా బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. ఐతే పెళ్లి తర్వాత సుజన అనుకున్నదొకటి అయినది మరొకటి.. కొన్నాళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదుగానీ వారుండే ఇంట్లోని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లిన సుజన మళ్లీ తిరిగిరాలేదు. తలుపులు మూసి ఉండటంతో కుటుంబ సభ్యులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.

  ఇది చదవండి: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో ఉంటే వాళ్లే భర్తగా పరిచయం.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్..!


  తర్వాతి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే తమ కుమార్తెను అదనపు కట్నం కోసం త్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగాచిత్రీకరిస్తున్నారని సుజన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  ఇది చదవండి: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..


  ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మొగల్తూరు మండలం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు, తులసి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్వని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వెండ్ర రామకృష్ణతో పెళ్లైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె.. సంక్రాంతికి భర్తతో కలిసి పుట్టిల్లైన కాళీపట్నం వచ్చింది. పండగ తర్వాత భర్త రామకృష్ణ హైదరాబాద్ వెళ్లిపోయాడు.

  ఇది చదవండి: ప్రియుడితో కలిసి షికారుకెళ్లిన యువతి.. ఏకాంతంగా ఉండగా నలుగురు ఎంట్రీ.. ఆ తర్వాత..


  ఈ క్రమంలో ఈనెల 20న అర్ధరాత్రి తన బైక్ పై ఒంటరిగా ముత్యాలపల్లివైపు వెళ్లిన అశ్విని.. వంతెన వద్ద బైక్, తన వస్తువులను ఉంచి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అశ్వినీ ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఉప్పుటేరు వద్ద ఆమె స్కూటీ ఉండటం చూసి అందులో గాలించగా మృతదేహం లభ్యమైంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Wife suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు