MARRIED SUSPECT DEATH RAISING MANY QUESTIONS IN VIJAYAWADA FULL DETAILS HERE PRN GNT
Death Mystery: రోడ్డుపక్కన మహిళ డెడ్ బాడీ.. విచారణలో సంచలన నిజాలు.. అసలేం జరిగింది..?
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) నగరం ఏటీ అగ్రహారానికి చెందిన తనూజ, మణికంఠ దంపతులు. ఇద్దరూ బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్త కూడా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. మంచి జీతం.. జీవితం. ప్రస్తుతం పుట్టింటి వద్ద ఉంటూనే వర్క్ చేస్తోంది. కానీ ఏమైందో ఏమో తెలియదు. రోడ్డుపక్కన శవమై కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) నగరం ఏటీ అగ్రహారానికి చెందిన తనూజ, మణికంఠ దంపతులు. ఇద్దరూ బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరి జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం తెలిసిన వారి దగ్గర వాకబు చేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు.
దీంతో కుటుంబ సభ్యులు సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న తరుణంలో విజయవాడ శిఖామణి సెంటర్ సమీపంలో రోడ్ పక్కన ఒక మహిళ మృతదేహం ఉందని పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియక పోవటంతో గుర్తు తెలియని మృతదేహంగా నిర్ధారణకు వచ్చిన విజయవాడ పోలీసులు మృతదేహాన్ని భద్రపరిచారు.
గుంటూరు పోలీసులు తనూజ ఫోటోతో పోల్చిచూడగా ఆ మృతదేహం తనూజ అని నిర్దారణకు వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం. ఇవ్వగా కుటుంబ సభ్యులు అది తనూజ మృతదేహంగా గుర్తించారు. ఐతే తనూజ డెత్ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గుంటూరులో అదృశ్యమైన విజయవాడలో శవమైన కనిపించడంతో పోలీసుల అనుమాలు బలపడుతున్నాయి.
ఆమె మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమ ఇంటి నుంచి ఎందుకు వచ్చేసింది.. వచ్చేముందు ఏమైనా గొడవ జరిగిందా..? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా..? అనే కోణంలో విచారిస్తున్నారు. తనూజ మృతదేహం లభించిన ప్రాంతానికి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గుంటూరు నుంచి తనూజ నేరుగా విజయవాడలోని బంధువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం తనూజ భర్త మణికంఠతో పాటు ఆమె తల్లిదండ్రులు, విజయవాడలోని బంధువులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.