హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh : ఇక్క‌డ పెళ్లి క‌ళ‌.. దుబాయ్‌లో గోల్డ్ జిగేల్‌.. ఆంధ్ర‌లో మొద‌లైన పెళ్లిళ్ల‌ సీజ‌న్ డిసెంబ‌ర్‌లోపు 29 ముహుర్తాలు

Andhra Pradesh : ఇక్క‌డ పెళ్లి క‌ళ‌.. దుబాయ్‌లో గోల్డ్ జిగేల్‌.. ఆంధ్ర‌లో మొద‌లైన పెళ్లిళ్ల‌ సీజ‌న్ డిసెంబ‌ర్‌లోపు 29 ముహుర్తాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh : రాష్ట్రంలో పెళ్లిసంద‌డి మొద‌లైంది. . రెండేళ్లుగా క‌రోనా.. ముహుర్తాలు లేక‌పోవ‌డం వంటి ఇబ్బందుల‌తో చాలా పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్ (December) ముగిసే స‌మ‌యానికి 29 ప్ర‌త్యేక పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి. ఈ నేప‌థ్య‌లో బంగారం కొనుగోళ్లు పెరిగాయ్‌. కొంద‌రు బంగారం కొనుగోలు కోసం దుబాయ్‌కి వెళ్తున్నారు.

ఇంకా చదవండి ...

  రాష్ట్రంలో పెళ్లిసంద‌డి మొద‌లైంది. . రెండేళ్లుగా క‌రోనా.. ముహుర్తాలు లేక‌పోవ‌డం వంటి ఇబ్బందుల‌తో చాలా పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్ (December) ముగిసే స‌మ‌యానికి 29 ప్ర‌త్యేక పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జోరుగా పెళ్లిలకు ఏర్పాటు చేసుకొంటున్నారు. పెళ్లిల కార‌ణంగా ఇటు ఇంట్లో.. అటు వ్యాపార కేంద్రాల్లో సంద‌డి నెల‌కొంది. ప్ర‌స్తుతం క‌రోనా త‌రువాత ఇంత వ్యాపారం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని.. రెండేళ్ల అనంత‌రం వ్యాపారం పుంజుకొంద‌ని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ జ్యువెల‌రీ ఓన‌ర్ పేర్కొన్నాడు. జ్యువెల‌రీ (Jewelry) షాప్‌లు అనే కాదు.. అన్ని పెళ్లి సంబంధిత వ్యాపారాలు నెమ్మ‌దిగా పుంజుకొంటున్నాయి. సాధార‌ణంగా అక్టోబర్ నుంచి పెళ్లి ముహుర్తాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్ర‌స్తుతం సీజ‌న్ చాలా బాగా ఉండ‌డంతో గోల్డ్ కొనుగోళ్లు.. పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం గోల్డ్ ర‌ష్‌ను ప‌రిశీలిస్తుంది. ప్ర‌తీ రాష్ట్రంలో క‌నీసం 50,000 పెళ్లిళ్లు అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్‌లో బంగారు కొనుగోళ్ల‌కు ఇబ్బంది రాకుండా ప్ర‌భుత్వం.. ఇటు వ్యాపార వ‌ర్గాలు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకొంటున్నాయి.

  బంగారం కోసం దుబాయ్ బాట‌..

  పెళ్లి అంటేనే బంగారం.. బంగారం ఉంటేనే పెళ్లి అన్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా పెళ్లి బ‌డ్జెట్‌లో 25శాతం పైన బంగారం కోస‌మే పెట్టుబ‌డి పెడ‌తారు. కొంత‌మంది బంగారం కొన‌డానికి ఇత‌ర దేశాల‌కు వెళ్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌కి వెళ్తున్నారు. ప్ర‌స్తుతం వివాహాల సీజ‌న్ కావడంతో చాలా మంది భార‌తీయులు దుబాయ్‌కి వెళ్లి బంగారం కొనుగోలు చేస్తున్నారు.

  Andhra Pradesh : ఉత్త‌రాంధ్ర‌కు "ఒడిశా కిక్కు".. అక్ర‌మంగా ఎన్‌డీపీఎల్ మ‌ద్యం విక్ర‌యాలు


  ఇటీవ‌లి కాలంలో తెలుగు వారు కూడా బంగారం కొనుగోలుకు ఎక్కువ‌గా వస్తున్నార‌ని దుబాయ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బంగారం అమ్మ‌కాలు ఈ సీజ‌న్‌లో 25శాతం పెర‌గిన‌ట్టు అక్క‌డి వారు

  త‌గ్గ‌ని డిమాండ్‌..

  గత సంవత్సరం దేశంలో బంగారం దిగుమతులు 67 శాతం పెరిగాయి. ప్ర‌స్తుతం 855 టన్నుల బంగారం దిగుమ‌తి చేసుకొంటోంది. వ్యాపారులు ఈ సంవత్సరం అదేవిధమైన రాబడిని ఎదురుచూస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా, బంగారం వర్తకులు 75 శాతం వివాహ సీజన్‌లో పెద్ద విజయాలు సాధించారు. 2008-2009 కాలంలో, ఆర్థిక సంక్షోభం అత్యంత అధ్వానంగా ఉన్నప్పుడు, బంగారం వ్యాపారులు లాభాలను చూశారు అని వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు. చెబుతున్నారు. భారతీయ కస్టమర్‌లు చెల్లించాల్సిన డ్యూటీని కూడా లెక్కించాలి.

  Andhra Pradesh : కృష్ణా ప్రాజెక్టులు బోర్డు ప‌రిధిలోకి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం!


  బంగారం (Gold) మొత్తాన్ని సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు, దుకాణదారులు దుబాయ్‌లో షాపింగ్ చేయడం ద్వారా సుమారు 6 నుండి 9 శాతం ఆదా చేస్తారు. దీంతో ప‌లువురు దుబాయ్ బాట ప‌డుతున్నారు..

  ప‌లు నిబంధ‌న‌లు..

  ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. పెళ్లికి వ‌చ్చే అతిథుల సంఖ్య‌ను 250కి ప‌రిమితం చేశారు. చాలా చోట్ల కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయినా రెండేళ్లుగా క‌ట్ట‌డి చేస్తున్నా.. ఈ సారి పెద్ద వివాహ సీజ‌న్ కావ‌డంతో జ‌నం పెళ్లికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra pradesh news, Gold, Marriages

  ఉత్తమ కథలు