కరోనా నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం

మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ (ఎంకేవీ) కమిటీ కార్యదర్శి కైలాసం ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు.

news18-telugu
Updated: April 6, 2020, 3:02 PM IST
కరోనా నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాలో జనం పిట్టల్లా రాలుతున్నారు. భారత్‌లోనూ ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనాను కట్టడిచేసేందుకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కరోనాపై యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుత కష్ట సమయంలో పోలీసులపై దాడులు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ (ఎంకేవీ) కమిటీ కార్యదర్శి కైలాసం ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు.

దేశ వ్యాప్తంగా కరోనాతో అధిక సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయని.. వేలాది మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కైలాసం అన్నారు. వైరస్​ను నిరోధించడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి గానీ పీఎల్​జీఏ, అనుబంధ సంస్థల నుంచి పోలీసులపై ఎటువంటి దాడులకు పూనుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు దాడులు జరిపితే వారి నుంచి తప్పించుకునే దానిలో భాగంగా ప్రతిఘటిస్తామని మావోయిస్టులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఐదు రోజులలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: April 6, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading