ఈ నెల 31న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు..

గత కొన్ని నెలలుగా పోలీసుల చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటూ వస్తున్న మావోలు.. ఉనికి నిలుపుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: January 20, 2019, 10:38 PM IST
ఈ నెల 31న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు..
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
  • Share this:
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ నెల 31న ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారాన్ని ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు ఏవోబీ కార్యదర్శి జగబంధు పేరుతో ఓ లేఖ విడుదలైంది. గిరిజన హక్కులను కాలరాస్తున్నారని, సమాధాన్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.

కాగా, గత కొన్ని నెలలుగా పోలీసుల చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటూ వస్తున్న మావోలు.. ఉనికి నిలుపుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లతో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ.. దళాలను మళ్లీ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోల ఏరివేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా ఫోకస్ చేశాయి.ఇదిలా ఉంటే, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ సమీపంలో ఎస్ఆర్ పైప్ లైన్‌ను మావోలు ధ్వంసం చేశారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి విశాఖకు ముడి ఇనుము సరఫరా నిలిచిపోయింది.
Published by: Srinivas Mittapalli
First published: January 20, 2019, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading