తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు... ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చాలామంది హైదరాబాద్‌లో ఉంటూ... తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో ఓటు వేశారు. మూడు నెలలు గడిచిపోయాయి. అప్పుడు వేలిపై వేసిన సిరా గుర్తు అప్పుడే చెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రావడంతో... ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది ఏపీకి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వెళ్తున్నారు. ఐతే... ఇలా ఏపీకి వెళ్తున్నవారిలో చాలా మందికి రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ కార్డులు ఉన్నాయన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మరి వాళ్ల ఓట్లు చెల్లుతాయా... తెలంగాణలో ఓటు వేసిన వాళ్లు, ఏపీలో మళ్లీ ఓటు వేస్తే దాన్ని ఎన్నికల సంఘం ఎలా పరిగణిస్తుందన్నది తేలాల్సిన అంశం.
రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రా ప్రాంతానికి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అందువల్ల వారంతా హైదరాబాద్‌లో ఓటు హక్కు పొందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత... వారంతా తెలంగాణలో ఓటర్లుగా గుర్తింపు పొందారు. కొంతమంది ఆంధ్రా ప్రాంత ఓటర్లుగా తమ ఓటర్ ఐడీలు మార్పించుకున్నారు. మరికొంతమంది మాత్రం ఆంధ్రాలో కూడా ఓటర్ ఐడీలు పొందారు. ఇలా చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్ కార్డులు సంపాదించుకున్నారు. వాళ్లంతా ఇప్పుడు ఓటు వేస్తే... అది చెల్లుతుందా అన్నది కొత్త సమస్య.
రెండు ఓటర్ కార్డులు ఎందుకు :ఆంధ్రాప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు ఉండేందుకు చాలా మంది అక్కడ తమ సొంత ఊర్లలో ఓటర్ ఐడీ కార్డులు పొందారు. తద్వారా తాము ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పౌరులుగా గుర్తింపు పొందారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు, సదుపాయాలూ, పథకాలను పొందుతున్నారు. ఐతే... వారిలో చాలా మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు. అందువల్ల వాళ్లంతా తెలంగాణ ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు, పథకాల లబ్దిని పొందేందుకు తెలంగాణలో కూడా ఓటర్ ఐడీలను పొందారు. ఇలా రాష్ట్రం విడిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ ఐడీలను పొందిన పరిస్థితి ఏర్పడింది.
ఇది రైటా... రాంగా :చట్టప్రకారమైతే రెండు రాష్ట్రాల్లోనూ రెండు ఓటర్ ఐడీలు ఉండటం తప్పే. ప్రజాస్వామ్య విధానంలో అది నేరం. రాష్ట్ర విభజనలో వల్ల ఏర్పడిన సమస్యల్లో పరిష్కారం కాకుండా ఉన్నవాటిలో ఇదీ ఒకటి. అంతే తప్ప ప్రజలెవరూ కావాలని రెండు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు పొందలేదన్నది కఠిన వాస్తవం. కేంద్ర ఎన్నికల సంఘం చట్టప్రకారమే నడుచుకుంటుంది కాబట్టి... ఒక వ్యక్తి రెండు ఓటర్ ఐడీలు కలిగివుంటే... వాటిలో ఒకటి తొలగిస్తుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఓట్లను ఇలాగే తొలగించారు కూడా. అయినప్పటికీ ఇంకా కొన్ని లక్షల మందికి డబుల్ ఓటర్ ఐడీలు ఉన్నట్లు అంచనాలున్నాయి. ఈ ఎన్నికల వరకూ వారు వేసే ఓట్లు చెల్లుతాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తర్వాత... డబుల్ ఐడీలను తొలగించి... ఒకటే ఓటర్ ఐడీ ఉండేలా చేస్తారని తెలిసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.