• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • MANSAS TRUST DECIDES TO SHIFT REVENUE OFFICE FROM VIZIANAGARAM FORT TO VISAKHAPATNAM ACCORDING TO SANCHAITA GAJAPATI RAJU WISH BA

MANSAS Trust: మన్సాస్ ట్రస్ట్ విషయంలో పంతం నెగ్గించుకున్న సంచయిత గజపతిరాజు

MANSAS Trust: మన్సాస్ ట్రస్ట్ విషయంలో పంతం నెగ్గించుకున్న సంచయిత గజపతిరాజు

సంచయిత గజపతిరాజు

విజయనగరం మన్సాస్ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు కోరినట్టే జరిగింది. ఆమె కోరినట్టు మన్సాస్ ట్రస్ట్ కార్యాలయాన్ని విజయనగరం కోట నుంచి విశాఖపట్నానికి తరలించింది.

  • Share this:
    విజయనగరం మన్సాస్ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు కోరినట్టే జరిగింది. ఆమె కోరినట్టు మన్సాస్ ట్రస్ట్ కార్యాలయాన్ని విజయనగరం కోట నుంచి విశాఖపట్నానికి తరలించింది. విశాఖపట్నంలోని పద్మనాభ మండలంలో ఉన్న MRVRR కాలేజీలో రెవిన్యూ ఆఫీసు మార్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు ఆదేశాల మేరకు మెమో జారీ అయింది. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆ మెమోలో పేర్కొన్నారు. 1958లో మన్సాస్ ట్రస్ట్ ఏర్పడింది. దీన్ని విజయనగరం మహారాజా పీవీజీ రాజు హయాంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ సంస్థ రెవిన్యూ ఆఫీసు విజయనగరం కోటలోనే ఉంది. అయితే, తాజాగా అక్కడి నుంచి ఆఫీసును మార్చాలని సంచయిత గజపతి రాజు భావించారు. అందుకు తగినట్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. పరిపాలన సౌలభ్యం, మేనేజ్‌మెంట్, భద్రత గురించి రెవిన్యూ ఆఫీసును మార్చుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ ఆఫీసును మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మన్సాస్ ట్రస్ట్ ఈవో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు లేఖ రాశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: