ఏపీకి కొత్త ఇంటలిజెన్స్ చీఫ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్ స్థానంలో మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది.

news18-telugu
Updated: December 5, 2019, 9:12 AM IST
ఏపీకి కొత్త ఇంటలిజెన్స్ చీఫ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్ స్థానంలో మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది. విశ్వజిత్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన మనీశ్ కుమార్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ హసన్ రజాను జైళ్ల శాఖ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ప్రస్తుత నెల్లూరు ఎస్పీ ఐశ్యర్య రస్తోగీ స్థానంలో భాస్కర్ భూషణ్‌ను నియమించింది. ఐశ్వర్య రస్తోగిని డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ విభాగం ఏఐజీగా నియమించింది. అలాగే టీఏ త్రిపాఠిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేసింది.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>