హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Mango: ఆంధ్రా మామిడికి ఉక్రెయిన్ కష్టాలు.. రైతులకు నష్టాలు తప్పవా..?

Andhra Mango: ఆంధ్రా మామిడికి ఉక్రెయిన్ కష్టాలు.. రైతులకు నష్టాలు తప్పవా..?

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపోందించ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మ‌న‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చ‌ర్మం అందంగా మృదువుగా ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. సో అందుకే మచ్చలేని చర్మాన్ని పొందడానికి మామిడి పండ్లను తినండి. (ప్రతీకాత్మకచిత్రం)

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపోందించ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మ‌న‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చ‌ర్మం అందంగా మృదువుగా ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. సో అందుకే మచ్చలేని చర్మాన్ని పొందడానికి మామిడి పండ్లను తినండి. (ప్రతీకాత్మకచిత్రం)

వేసవి కాలం (Summer) వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్లు (Mangos) సిద్ధమైపోతుంటాయి. రుచికరమైన మామిడి పండ్లకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పండే మామిడి పళ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.

  వేసవి కాలం (Summer) వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్లు (Mangos) సిద్ధమైపోతుంటాయి. రుచికరమైన మామిడి పండ్లకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పండే మామిడి పళ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఐతే కరోనా కారణంగా గత రెండేళ్లుగా మామిడికి విదేశీ మార్కెట్ పెద్దగా లేదు. రైతులంతా దేశీయంగానే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే కరోనా నియంత్రణలోకి రావడంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఐతే ఇప్పుడు రైతులకు అనుకోని కష్టం వచ్చిపడింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రభావం మామిడి ఎగుమతులపై పడింది. యుద్ధం కారణంగా విమాన రాకపోవకలపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఐతే ఇంకా పూర్తిస్థాయిలో మామిడి దిగుమతులు ప్రారంభం కాకపోవడంతో ఓ నెలలో అయినా పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నారు.

  ఏపీలో ప్రతిఏడాది లక్షలాది ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఈ సారి 3.35 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. గతేడాది వర్షాలతో పూత రాలిపోవడం, ఈ ఏడాది ఆరంభంలో తామర పురుగు సోకడంతో రైతులు ఆందోళన చెందినా.. పిందె మాత్రం ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హెక్టార్‌కు 12 టన్నుల చొప్పున 40లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశముందని రైతులంటున్నారు.

  ఇది చదవండి: ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన.., ఈ జిల్లాలకు అలర్ట్..

  ఇప్పటికే పంటను ఎగుమతి చేసేందుకు రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 18,486 మంది రైతులు నమోదు చేసుకోగా.., మరింత మందిని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో పలుచోట్ల బయ్యర్స్-సెల్లర్స్ మీట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో పండించే బంగిన పల్లి, చిన్నరసాలు, సువర్ణరేఖ, తోతాపూరి వంటి రకాలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లలో మామిడికి పెద్దగా ధర రాలేదు. ఈ సారైనా టన్నుకు లక్షకు పేగా ధర వస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

  ఇది చదవండి: మట్టికుండలో నీరు తాగితే ఇన్ని లాభాలున్నాయా..? పెద్దలేం చెబుతున్నారంటే..!

  లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ గత ఏడాది మన రైతులు గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూరప్ దేశాలకు మామిడిని ఎగుమతి చేశారు. ఏపీ నుంచి వెళ్లే ఎగుమతల్లో దాదాపు 40శాతం యూరప్ దేశాలకు, 50 శాతం వరకు గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీంతో ఎగుమతులు నిలిచిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐతే ఏప్రిల్ మొదటివారానికి పంట చేతికొచ్చే అవకాశముండటంతో పరిస్థితులు చక్కబడతాయని ఎగుమతిదారులు భావిస్తున్నారు. మరి యుద్ధం ముగిసి మామిడికి కష్టాల తీరుతాయో లేదో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cooking oil, Russia-Ukraine War

  ఉత్తమ కథలు