హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: మ్యాంగో లవర్స్ కి గుడ్ న్యూస్... ఈ సమ్మర్ మామిడి పండ్లకు ఢోకా లేనట్లే...

Andhra Pradesh: మ్యాంగో లవర్స్ కి గుడ్ న్యూస్... ఈ సమ్మర్ మామిడి పండ్లకు ఢోకా లేనట్లే...

Mango Season: వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా గత రెండు మూడేళ్లలో మామిడి దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. వెదర్ ఎఫెక్ట్ తో ఫలరాజు కొండెక్కి కూర్చుంటున్నాడు.

Mango Season: వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా గత రెండు మూడేళ్లలో మామిడి దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. వెదర్ ఎఫెక్ట్ తో ఫలరాజు కొండెక్కి కూర్చుంటున్నాడు.

Mango Season: వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా గత రెండు మూడేళ్లలో మామిడి దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. వెదర్ ఎఫెక్ట్ తో ఫలరాజు కొండెక్కి కూర్చుంటున్నాడు.

  సమ్మర్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తుంటారు. తియ్యతియ్యటి మామిడి కాయలను తినేందుకు ఉత్సాహపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి దిగుబడి భారీగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా గత రెండు మూడేళ్లలో మామిడి దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. వెదర్ ఎఫెక్ట్ తో ఫలరాజు కొండెక్కి కూర్చుంటున్నాడు. ఐతే ఈ సీజన్లో మాత్రం మామిడి దిగుబడి ఆశాజనకంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న తోటల్లో పూత బావుందని గతంలో కంటే అధిక దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో భారీగా దిగుబడి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు కూడా తోటలు పూత, పిందెలతో కళకళలాడుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  ఇటీవల అక్కడక్కడా వర్షాలు పడినా అవి మామిడి పంటపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో పూత, పిందె నిలబడేందుకు రైతులు చర్యలు తీసుకంటున్నారు. కొన్ని చోట్ల పిందెదశల్లో ఉన్న మామిడికి సంచులు చుట్టి కాపాడుకుంటున్నారు. ఇలా చేస్తే దిగుబడి బాగా వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,76,494 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ముఖ్యంగా బంగినపల్లి, చిన్నరసాలు, పెద్దరసాలు, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, జలాలు, మల్లిక లాంటి రకాలు రాష్ట్రంలో సాగవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో మామిడి అధికంగా సాగవుతోంది. .

  సాధారణంగా మామిడి తోటల్లో డిసెంబర్, జనవరి మాసాల్లో పూత వస్తుంది.  ఫిబ్రవరి, మార్చిలో  పూత పిందెలుగా మారుతుంది.  మార్చి నెలాఖరు నుంచి దిగుబడి వస్తుంది. ఐతే  ప్రతి ఏటా ఇదే సమయంలో ఈదురుగాలులు, అకాల వర్షాల  వచ్చి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. మంచు ప్రభావం కూడా మామిడి పంటపై అధికంగానే ఉంటోంది. గత ఏడాది ఎకరానికి రెండు నుండి మూడు టన్నుల దిగుబడి రాగా.. ఈ ఏడాది 5 నుంచి 6 టన్నులు వచ్చే అవకాశమున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు.

  గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 46.88 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. హెక్టార్ కు 10 నుంచి 13 టన్నులు అంటే సగటున హెక్టార్ కు 12 టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దిగుబుడులు భారీగా వచ్చే అవకాశముండటంతో రైతులు కూడా భారీ లాభాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. గతేడాది వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కుతామని భావిస్తున్నారు.

  First published:

  Tags: Agriculture, Andhra Pradesh, Andhra pradesh news, AP News, Farmers, Telugu news

  ఉత్తమ కథలు