Home /News /andhra-pradesh /

MANCHU MANOJ AP CM YS JAGAN MANCHU MANOJ MEETS AP CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY HERE ARE THE DETAILS TA

Manchu Manoj - AP CM YS Jagan : ఏపీ సీఎం వైయస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన మంచు మనోజ్..

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మంచు మనోజ్ (Twitter/Photo)

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మంచు మనోజ్ (Twitter/Photo)

Manchu Manoj - AP CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) వై.యస్. జగన్మోహన్ రెడ్డి(Y.S.Jagan Mohan Reddy)ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మర్యాద పూర్వకంగా కలిసారు.

    Manchu Manoj - AP CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) వై.యస్. జగన్మోహన్ రెడ్డి(Y.S.Jagan Mohan Reddy)ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా మంచు మనోజ్.. సినిమాల కంటే వ్యాపారాలు ఇతర ముఖ్య విషయాలపైనే ఎక్కువగా  దృష్టి పెడుతున్నారు. రీసెంట్‌గా మనోజ్ తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మంచు మనోజ్.. తెలంగాణలో అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ పై తన అభిప్రాయాలను టీ మంత్రులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కార్యక్రమాలు చూస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు తాను చేయబోయే వ్యాపారాలతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నట్టు చెప్పుకొచ్చారు.

    రీసెంట్‌గా మనోజ్.. తిరుమల వెంకన్నను దర్శించుకొన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తాను సినిమాలు, వ్యాపారాలు రెంటింటిని ఒకేసారి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా  నిర్వహించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా మంచు మనోజ్.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు ఆఫీసులు కలిసారు.


    ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్ కోసం ఆయన చేస్తోన్న ప్రణాళికలు, దూరదృష్టి, ముందు చూపు, సంక్షేమ పథకాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం తనను ఎంతోగానే ముగ్దుడిని చేసిందన్నారు. మంచి పనులు చేస్తోన్న జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Nuvvu Naaku Nachav@20Years: 20 యేళ్ల వెంకటేష్ కల్ట్ కామెడీ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫైనల్ కలెక్షన్స్..

    మంచు మనోజ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని మంచు మనోజ్.. ఇపుడు తన ఆశలన్ని ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.ఈ సినిమాపై మంచు మనోజ్ చాలా ఆశలే పెట్టుకున్నారు. దాంత పాటు కొన్ని కథలను ఓకే చేసినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Manchu Manoj, Tollywood

    తదుపరి వార్తలు