Inter Results 2019, AP Intermediate: నేడే ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. News 18లో చెక్ చేసుకోండి...

Manabadi AP Inter Results | Andhra Pradesh Intermediate Result 2019, 1st year and 2nd year exam results with News18: నేటి ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులు రెండింటికి కలిపి ఉమ్మడిగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

news18-telugu
Updated: April 12, 2019, 1:18 PM IST
Inter Results 2019, AP Intermediate: నేడే ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. News 18లో చెక్ చేసుకోండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫస్టియర్, సెకండ్ ఇయర్‌ల ఫలితాలను కలిపి ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఉదయం 11 గంటలకు అధికారికంగా ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తున్నామని, ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bieap.gov.in అందుబాటులో ఉంచనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఏపీ సెక్రటేరియట్, బ్లాక్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 209లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల అధికారిక కార్యక్రమం నిర్వహించునున్నారు.


ఇదిలా ఉంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకూ సెకండియర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,07,302 మంది విద్యార్థులు హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,10,298 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం ఏప్రిల్ 13న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయగా, 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునేందుకు న్యూస్ 18  తెలుగు ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఈ క్రింద లింక్ లో వివరాలు తెలియజేసి విద్యార్థులు రిజల్ట్స్ పొందవచ్చు. 
First published: April 12, 2019, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading