హోమ్ /వార్తలు /andhra-pradesh /

Cheating Woman: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో ఉంటే వాళ్లే భర్తగా పరిచయం.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్..!

Cheating Woman: ఆమె ఓ ఖతర్నాక్ లేడీ.. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. ఎవరితో ఉంటే వాళ్లే భర్తగా పరిచయం.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్..!

Married Woman: ఆమె ఒక ఖతర్నాక్ లేడీ. ఎవరితో ఉంటే వారినే భర్తగా పరిచయం చేస్తుంది. అంతేకాదు ఆధార్ కార్డుల్లో పేరు కూడా మార్చేస్తుంది. తాళికట్టిన భర్తను వదిలేసి ఇద్దరితో సహజీవనం చేసింది.

    ఆమె ఒక ఖతర్నాక్ లేడీ. ఎవరితో ఉంటే వారినే భర్తగా పరిచయం చేస్తుంది. అంతేకాదు ఆధార్ కార్డుల్లో పేరు కూడా మార్చేస్తుంది. తాళికట్టిన భర్తను వదిలేసి ఇద్దరితో సహజీవనం చేసింది. ఐతే వారిలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అసలు బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) ఉంగుటూరు మండలం పొణుకుమాడుకు చెందిన కటారి శివయ్య లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో 17 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధం (Extramarital Affair) గా మారడంతో అతడితో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్ల తర్వాత శివయ్యను వదిలేసి పెదఒగిరాలకు చెందిన చెల్లుబోయిన రాంబాబు అనే వ్యక్తితో వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడితోనే సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె పొణుకుమాడు వచ్చింది.

    ఐతే ఏమైందో ఏమో తెలియదుగానీ శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు శివయ్య అచేతనంగా పడిఉన్నాడు. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. దీనిపై మహిళను ప్రశ్నించగా.. అనారోగ్యంగా ఉంటే ఉంగుటూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడని చెప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను విచారించారు.

    ఇది చదవండి: ఎనిమిదేళ్లుగా సహజీవనం.. ప్రియురాలిపై అనుమానం.. సంబంధం లేని వ్యక్తులు బలి..

    పోలీసుల విచారణలో సదరు మహిళ గురించి సంచలన నిజాలు తెలిశాయి. భర్తను వదిలేసిన మహిళ.. ఆ తర్వాత ఇద్దరితో సహజీవనం చేసింది. ప్రస్తుతం చెల్లుబోయిన రాంబాబుతో ఎఫైర్ నడుపుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అంతేకాదు తాను ఎవరితో ఉంటే వారిని తన భర్తగా చూపిస్తూ ఆధార్ కార్డుల్లో కూడా పేర్లు మార్పించుకున్నట్లు విచారణలో తేలింది. ఐతే మూడు రోజుల క్రితం పొణుకుమాడు ఎందుకొచ్చింది. శివయ్యను ఎందుకు కలిసింది. శివయ్య ఎలా చనిపోయాడు. హత్యా..? సహజ మరణమా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    ఇది చదవండి: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..

    ఇదిలా ఉంటే గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గుంటూరు శివారులోని నల్లపాడులో లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న ఓ దాబాలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. ఐతే అప్పటికే మరో ఇద్దరితో వ్యవహారం నడుపుతున్న మహిళ.. ప్రియుడితో గొడవ పెట్టుకుంది. తన సుఖాలకు అడ్డొస్తున్నాడనే కోపం అంతమొందించాలని స్కెచ్ వేసింది. దీంతో తన ఇద్దరు మాజీ ప్రియులను పిలిపించి ఇతడ్ని దారుణంగా హత్య చేయించింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు