Home /News /andhra-pradesh /

MAN KILLED MOTHER AND SON FOR DOUBTING HIS LOVER OVER EXTRAMARITAL AFFAIR IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Extramarital affair: ఎనిమిదేళ్లుగా సహజీవనం.. ప్రియురాలిపై అనుమానం.. సంబంధం లేని వ్యక్తులు బలి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: సమాజంలో జరుగుతున్న చాలా నేరాలకు మూలం అక్రమ సంబంధాలే అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ఇద్దర్ని హతమార్చాడు. మరో వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు.

    వివాహేతర సంబంధాలు (Extramarital Affair) మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తాయి. అంతేకాదు అలాంటి బంధాల మోజులో నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. సమాజంలో జరుగుతున్న చాలా నేరాలకు మూలం అక్రమ సంబంధాలే అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ఇద్దర్ని హతమార్చాడు. మరో వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District) అబంటివారిపాలెంకు చెందిన నూర్జహాన్ కు గతంలో నెల్లూరుకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఐతే కొంతకాలానికి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నుర్జహాన్ సోదరుడితో... సమీప బంధువైన షేక్ రబ్బానీ సోదరికి పెళ్లైంది. ఈ క్రమంలో రబ్బానీతో నూర్జహాన్ కు సాన్నిహిత్యం పెరిగి అది సహజీవనానికి దారితీసింది. ఎనిమిదేళ్లుగా ఇద్దరూ ఒంగోలులో ఉంటూ టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

    రబ్బానీ నిర్వహించే టీ దుకాణంలో మండ్ల కాశీ కుమార్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. నూర్జహాన్ కూడా అక్కడికి వస్తుండేది. ఈ క్రమంలో కాశీకుమార్ తో చనువుగా ఉంటోంది. దీంతో నూర్జహాన్, కాశీ కుమార్ మధ్య అక్రమ సంబంధం ఉందని రబ్బానీ అనుమానించేవాడు. దీనిపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రబ్బానీ వేధింపులు భరించలేని నూర్జహాన్.. పుట్టింటికి వెళ్లిపోయి తన సోదరుడు మస్తాన్ ఇంట్లో ఉంటోంది.

    ఇది చదవండి: మూడు నెలల క్రితమే పెళ్లి.. మంచి ఉద్యోగం.. కానీ ఇంతలోనే అలా చేస్తుందనుకోలేదు..


    ఐతే నూర్జహాన్ తనకు దూరమవడానికి మస్తానే కారణమని భావించిన రబ్బానీ అతడిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం అంబటివారిపాలెంలోని మస్తాన్ ఇంటికి వెళ్లాడు. ఆసమంసోలో అతడు ఇంట్లో లేకపోవడంతో మస్తాన్ భార్య మీరమ్మ మెడపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న ఆమె కుమారుడు అక్బర్.. తల్లిపై దాడిని అడ్డుకోగా అతడ్ని కూడా కత్తితో పొడిచాడు. దీంతో ఇద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.

    ఇది చదవండి: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..


    ఇద్దరీ చంపిన అనంతరం ఒంగోలు వెళ్లిన రబ్బానీ.. తన టీ స్టాల్ లో పనిచేసే కాశీకుమార్ పై దాడి చేశాడు. కత్తితో అతడి గొంతుకోశాడు. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రబ్బానీని అదుపులోకి తీసుకున్నాడు. గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ కు తరలించారు. తన ప్రియురాలు నూర్జహాన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే కాశీకుమార్ పై హత్యాయత్నం చేశాని.. నూర్జహాన్ ఆచూకీ చెప్పనందుకే మీరమ్మను, ఆమె కుమారుడ్ని హత్య చేశానని విచారణలో రబ్బానీ అంగీకరించాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఐతే అసలు వ్యవహారంతో సంబంధం లేని తల్లికొడుకులు హత్యకు గురవడంతో మస్తాన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Nellore Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు