అతడికి పెళ్లైంది. భార్య.. మరిదితో ఎఫైర్ పెట్టుకుంది. ఆ కక్షతో ఆమెను చంపేశాడు. కొన్నాళ్లకు రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తమ్ముడితో భార్య ఎఫైర్ పెట్టుకుందని అనుమానించాడు. ఈసారి భార్యను వదిలేసి తమ్ముడ్ని హతమార్చాడు. దాదాపు నెల రోజులపాటు మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు ఛేదంచారు. వివగాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లికి చెందిన రంగనాథ్ కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఐతే భార్యతో తమ్ముడి అనంత రాజుకు వివాహేతర సంబంధం ఉండేది. ఇద్దరి వ్యవహారం తెలిసిన రంగనాథ్.. మొదటి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఐతే రెండో భార్యతోనూ అనంతరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంగనాథ్ అనుమానించాడు.
ఈ క్రమంలో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. తమ్ముడితోనే వివాదాలుండేవి. ఐతే తమ్ముడు తన భార్యను వదలడం లేదని భావించిన రంగనాథ్.. అతడ్ని హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో గార్లదిన్నె మండలం కల్లూరులో ఉంటున్న అనంతర రాజు వద్దకు వెళ్లాడు. రాత్రి పూట నిద్రిస్తుండగా అతడి గొంతుపై రాడ్డుతో కొట్టి అనంతరం బెల్టులో గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని తీసుకెళ్లి రామదాసు పేట సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడేసి సూసైడ్ గా చిత్రీకరించేందుకు యత్నించాడు.
అయితే అనంతరాజును మృతిపై అతడి భార్య సుజాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషంయం బయటపడింది. దీంతో రంగనాథ్ ను అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద అరెస్ట్ చేశారు.
ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. అవుకు ఎస్ఐ ఫక్రుద్దీన్ ఇద్దరు మహిళలతో ఎఫైర్ పెట్టుకొని వారిలో ఒకర్ని హత్య చేయించాడు. ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్న సుమలత అనే మహిళతో ఫక్రుద్దీన్ కు పరిచయమైంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
ఐతే సుమలతకు అదే పట్టణానికి చెందిన బొడ్డు సుజాత అనే మహిళతో స్నేహముంది. ఈ క్రమంలో సుజాత.. సుమలత దగ్గర ఆరు లక్షలు అప్పుగా తీసుకుంది. మరోవైపు ఫక్రుద్దీన్ తో గొడవ కారణంగా.. సుమలత అతడ్ని దూరం పెట్టింది. ఐతే మరొకరితో చనువుగా ఉంటూ తనను దూరం పెట్టిందని ఫక్రుద్దీన్ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమని అడగడంతో సుజాత కూడా సుమలతపై కోపం పెంచుకుంది. మరోవైపు సుజాతతో పరిచయం పెంచుకున్న ఫక్రుద్దీన్ ఆమెతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు.
మరోవైపు తాను ఇచ్చిన అప్పు తిరిగివ్వాలని సుమలత.. సుజాతపై ఒత్తిడి చేసింది. దీంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని సుజాత.. తన స్నేహితురాలిని అడ్డుతొలగించుకోవాలని భావించింది. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ ఫక్రుద్దీన్ దీనికి మరింత ఆజ్యం పోశాడు. సుమలతపై ఆగ్రహంతో ఉన్న ఆయన హత్య ఎలా చేయాలో, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో నిందితులకు సూచనలిచ్చాడు. సుజాతకు రామకృష్ణ, వసంత అనే వారు జత కలిశారు. ఫక్రుద్దీన్ సూచనలతో సుమలతను జనవరి 16న దారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణలో సుమలతతో ఫక్రుద్దీన్ కు ఉన్న ఎఫైర్ సంగతి బయటపడింది. లోతుగా విచారిస్తే ఫక్రుద్దీన్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగినట్లు నిర్ధారణ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs, Murder