ఆ మాటలు నమ్మితే అంతే.. టెస్ట్ డ్రైవ్ పేరుతో బురిడీ..

ఇటీవల వైఎంఆర్ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తి బైక్‌ను కూడా దివాకర్ ఇలాగే దొంగిలించాడు. దీంతో ఈ నెల 28న దివాకర్‌పై కేసు నమోదైంది. సోమవారం స్థానిక శివాలయంలో దివాకర్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సిబ్బందితో వెళ్లిన ఎస్ఐ చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నాడు.

news18-telugu
Updated: April 30, 2019, 12:46 PM IST
ఆ మాటలు నమ్మితే అంతే.. టెస్ట్ డ్రైవ్ పేరుతో బురిడీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతను చదివింది ఏడో తరగతే.. కానీ మాటలు మాత్రం బాగా నేర్చాడు. ఎంతటివాళ్లనైనా ఇట్టే మాటల్లోకి దింపగలడు. ఆ మాటలతోనే ఇప్పటివరకు ఎంతోమందిని బురిడీ కొట్టించి.. వాళ్ల బైక్స్‌తో పరారయ్యాడు. సోమవారం ప్రొద్దుటూరు ఎస్ఐ దివాకర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఎట్టకేలకు అతన్ని పట్టుకోగలిగాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఈశ్వరరెడ్డి నగర్‌లో దివాకర్ అనే యువకుడు తాత, నానమ్మలతో కలిసి నివసిస్తున్నాడు. ఏడో తరగతిలోనే చదువు మానేసిన దివాకర్.. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. అదే క్రమంలో బైక్ చోరీలకు కూడా అలవాటుపడ్డాడు.

సాయంత్రం వేళల్లో స్థానిక స్కూల్స్, కాలేజీ మైదానాలకు దివాకర్ వెళ్తుండేవాడు. అక్కడ ఎవరైనా బైక్‌తో కనిపిస్తే.. వారి వద్దకు వెళ్లి.. 'అన్నా మీ బైక్ బాగుంది.. ఎంత పెట్టి కొన్నారు..' అని అడిగేవాడు. 'నేనూ ఇలాంటి బైక్ కొనాలనుకుంటున్నా.. ఒకసారి మీ బండి డ్రైవ్ చేయొచ్చా' అని బతిమాలేవాడు. వాళ్లకు నమ్మకం కుదిరేందుకు తన డొక్కు బైక్‌ను అక్కడే వదిలి వెళ్లేవాడు. దివాకర్ మాటలు నమ్మి.. టెస్ట్ డ్రైవ్‌కు వారు అంగీకరించారంటే.. ఇక అంతే సంగతి. ఆ బైక్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.

ఇటీవల వైఎంఆర్ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తి బైక్‌ను కూడా దివాకర్ ఇలాగే దొంగిలించాడు. దీంతో ఈ నెల 28న దివాకర్‌పై కేసు నమోదైంది. సోమవారం స్థానిక శివాలయంలో దివాకర్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సిబ్బందితో వెళ్లిన ఎస్ఐ చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. గత వారంలో రెండు బైక్స్ దొంగిలించినట్టు విచారణలో అంగీకరించాడు. ఇందులో అపాచీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. అంతకుముందు హోండా షైన్, టీవీఎస్ అపాచీలను దొంగిలించినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు