MAN ESCAPED WITH ANOTHER MAN WIFE AFTER HIS WIFE WENT TO KUWAIT FOR REPAY THE DEBTS IN EAST GODAVARI DISTRICT HSN
ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన భార్య.. అదే ఊళ్లో వేరొకరి భార్యతో భర్త ఎస్కేప్.. వెళ్తూ వెళ్తూ వాళ్లు చేసిన పనికి..
ప్రతీకాత్మక చిత్రం
ఓ మహిళ కుటుంబ కష్టాలను తీర్చేందుకు కువైట్ కు ఉఫాధి నిమిత్తం వెళ్లింది. ఆ భర్త మాత్రం ఒంటరిగా ఉండలేకపోయాడేమో, అదే ఊళ్లో వేరకొరి భార్యతో ఎస్కేప్ అయ్యాడు. ఒకరి తర్వాత మరొకరు ఇళ్ల నుంచి మాయం కావడంతోనే వీరిద్దరిపై అనుమానం కలిగింది
భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి రాక వల్ల ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ప్రతీరోజూ ఈ ఘోరాలకు సంబంధించి లెక్కకు మించిన వార్తలను చదువుతూనే ఉండి ఉంటారు. తాజాగా వివాహేతర సంబంధం వల్ల రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. ఓ మహిళ కుటుంబ కష్టాలను తీర్చేందుకు కువైట్ కు ఉఫాధి నిమిత్తం వెళ్లింది. ఆ భర్త మాత్రం ఒంటరిగా ఉండలేకపోయాడేమో, అదే ఊళ్లో వేరకొరి భార్యతో ఎస్కేప్ అయ్యాడు. ఒకరి తర్వాత మరొకరు ఇళ్ల నుంచి మాయం కావడంతోనే వీరిద్దరిపై అనుమానం కలిగింది. దీంతో ’నా భార్యను నాకు ఇప్పించండి‘ అంటూ బాధిత భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అయితే ఇళ్ల నుంచి ఎస్కేప్ అయిన వాళ్లు ఒక్కరే వెళ్లిపోకపోవడమే ఇక్కడ ట్విస్ట్. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట మండలం ఇరుసుమండలో క్రాప రాజకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు. కుటుంబంలో ఆర్థిక కష్టాలను తీర్చేందుకు అతడి భార్య ఉపాధి నిమిత్తం కువైట్ కు వలస వెళ్లింది. ప్రతి నెలా అప్పులు తీర్చేందుకు, పిల్లల చదువుల కోసం ఆమె డబ్బులు కూడా పంపిస్తుండేది. అయితే కాప్ర రాజకుమార్ మాత్రం అదే ఊళ్లోని నేదునూరి సుగుణకుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడి, చివరకు ఇద్దరూ ఎస్కేప్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు.
మార్చి నాలుగో తారీఖున అర్ధరాత్రి సుగుణ కుమారి ఇంట్లో నుంచి మాయం అయింది. ఆ తర్వాత మరుసటి రోజు మార్చి ఐదో తారీఖున క్రాప రాజకుమార్ ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యాడు. వీరిద్దరి బంధం గురించి అప్పటికే సుగుణ కుమారి భర్త నేదునూరి చంద్రశేఖర్ కు అవగాహన ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబాజీ పేట పోలీసులకు ’నా భార్య క్రాప రాజకుమార్ తో వెళ్లిపోయింది‘ అని ఫిర్యాదు చేశాడు. అయితే ఇదే విషయమై క్రాప రాజకుమార్ సోదరుడు క్రాప నాగరాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుగుణకుమారి, క్రాప రాజకుమార్ తోపాటు అతడి మూడో కుమార్తెను కూడా తమ వెంట తీసుకువెళ్లడమే అందరికీ అంతుపట్టని మిస్టరీలా మారింది. దీంతో ఆ పాపను వీళ్లు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో క్రాప నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి పోలీసులు వీరి విషయంలో ఏం చేస్తారో.? వేచిచూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.